డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ కార్యక్రమంతో వేలాది మంది పేద, మద్య తరగతి ప్రజల సొంత ఇంటి కల

Spread the love

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ కార్యక్రమంతో వేలాది మంది పేద, మద్య తరగతి ప్రజల సొంత ఇంటి కల సాకారమైందని, ఇది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వల్లనే సాధ్యమైందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు. మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని వెంకటాపురం లో 6 ఎకరాల విస్తీర్ణంలో 68 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 800 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించి 720 మంది లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ లబ్దిదారులపై ఒక్క రూపాయి భారం లేకుండా అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఉచితంగా ఇస్తున్న దేశంలోని ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. సొంత ఇల్లు లేని పేద, మద్య తరగతి ప్రజల సొంత ఇంటి కలను నేరవేర్చాలనేది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంకల్పంతోనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ కార్యక్రమం ప్రారంభమైందని చెప్పారు.

సుమారు 10 వేల కోట్ల రూపాయల వ్యయంతో GHMC పరిధిలో కొట్లారి రూపాయల విలువైన భూములలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. ఇప్పటి వరకు మూడు విడతలలో 60 వేలకు పైగా ఇండ్లను అర్హులైన లబ్దిదారులకు లబ్దిదారులకు కేటాయించడం జరిగిందని వివరించారు. ఇండ్ల పంపిణీ ని కూడా ఎంతో పారదర్శకంగా, పార్టీలకు అతీతంగా, రాజకీయ జోక్యం లేకుండా లబ్దిదారులను ఎంపిక చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఇండ్ల ను కూడా ఎలాంటి విమర్శలకు అవకాశం లేకుండా ర్యాండో మైజేషన్ పద్దతిలో ఆన్ లైన్ డ్రా నిర్వహించి కేటాయింపు చేస్తున్నట్లు వివరించారు. మీ అందరికి ముఖ్యమంత్రి దసరా కానుకగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అందజేస్తున్నట్లు మంత్రి చెప్పారు.

డ్రా లో ఎంపికైన వారికి ఇండ్లను ఇవ్వడం జరుగుతుందని, రాని వారు అదైర్య పడొద్దని, దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారందరికీ ఇండ్లను దశల వారిగా తప్పకుండా ఇస్తామని మంత్రి ప్రకటించారు. అవసరమైతే మరో లక్ష ఇండ్లనైనా నిర్మించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం గ్రామ సర్పంచ్ గీతా శ్రీనివాస్, MPTC రామారావు, హౌసింగ్ కార్పోరేషన్ CE సురేష్, EE వెంకటదాసు రెడ్డి, తహసిల్దార్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page