కూనంనేని సమక్షంలో వంద కుటుంబాలు చేరికలు.

Spread the love

ప్రజల సమస్యలు, పార్టీ విస్తరణ లక్షయంగా కార్యకర్తలు పనిచేయాలి.*
మతోన్మాద బీజీపీని ఓడిస్తేనే దేశానికి రక్షణ.*
సార్వత్రిక ఎన్నికల్లో సిపిఐ శ్రేణులు భాద్యతగా పనిచేయాలి.*
కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు.*


సాక్షితభద్రాద్రి కొత్తగూడెం//సుజాతనగర్: మండల పరిధిలోని నాయకులగూడెం, మర్రితండా, సుజాతనగర్ తదితర గ్రామాల నుంచి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు సమక్షంలో వంద కుటుంబాలవారు సీపీఐలో చేరారు. ఈ మేరకు మండలంలోని నాయకులగూడెం, మర్రితండా గ్రామాల్లో వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో వీరు సిపిఐలో చేరారు. వీరికి పార్టీ కండువాకప్పు పార్టీలోకి కూనంనేని, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఏర్పాటైన సమావేశాల్లో కూనంనేని మాట్లాడుతూ మతోన్మాద, కార్పొరేట్ బీజీపీ ప్రభుత్వాన్ని గద్దెదించితేనే దేశానికి, దేశ సంపదకు రక్షణ ఏర్పడుతుండం, ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతుందని కూనంనేని అన్నారు. పదేళ్ల మోడీ నేతృత్వంలోని బిజెపి పాలన ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూనే కొనసాగిందని, రైతులు మొదలు సామాన్యప్రజలు కష్టాలతోనే కళవెళ్లదీశారని అన్నారు.

మళ్ళీ బిజెపి గద్దెనెక్కితే దేశం అదోగతిపాలవుతుందని, విచ్చలవిడిగా ప్రజా, కార్మిక, రైతు, ఉద్యోగ చట్టాలని తీసుకువచ్చి బ్రతుకు లేకుండా చేస్తారని అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలను ఆయుధంగా మలుచుకొని బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. కమ్యూనిస్టు పార్టీపై నమ్మకంతో కొత్తగూడెం నియోజకవర్గ స్థానంలో గెలిపించి చట్టసభకు పంపారని వారి నమ్మకానికి అనుగుణంగా నియోజకవర్గ అభివృధ్ధికోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తీర్చేందుకు ఎల్లవేళలా సిపిఐ సిద్ధంగా ఉంటుందని అన్నారు. సిపిఐలో చేరినవారిలో మండే నాగేశ్వర్ రావు, మండే నాగరాజరాజేశ్వరి, వీరరావు, బాలు లక్ష్మీనారాయణ, మూడు శ్రీను, శంకర్, గుగులోత్ శ్రీను, భూక్యా వినోద్ కుమార్, మూడు హస్లీ, భూక్యా చిట్టెమ్మ, బొడ్డు నాగమణి, ఎస్ కె ఎంబీ, కళావతి తదితరులు వున్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు భూక్యా దస్రు, కుమారి హన్మంతరావు, జక్కుల రాములు, తాళ్ల వెంకటేశ్వర రావు, మంగ్యా, పొదిల శ్రీనివాస్, వేల్పుల భాస్కర్, వీర్ల మల్లేష్, దండు నాగేశ్వర్ రావు, తాళ్లూరి పాపారావు, ధర్మారావు, బొడ్డు కేశవరావు, కుమారి కృష్ణ, గణేష్, కొర్ర లక్ష్మ, భూక్యా శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page