హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ డిప్యూటీ మేయర్

Spread the love

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 28వ డివిజన్ పుష్పక్ అపార్ట్మెంట్ లో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్,కార్పొరేటర్లు జ్యోతి నర్సింహా రెడ్డి, సుజాత,ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా బిఆర్ఎస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్న కొడుకు కౌశిక్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుండి తెలంగాణ రాష్ట్రం తిరుగమన దిశలో పయనిస్తుందన్నారు.బిఆర్ఎస్ చేసిన అభివృద్ధి మినహా కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసింది ఏమీ లేదన్నారు. గత పది సంవత్సరాలలో
హైదరాబాదు నగరాన్ని కెసిఆర్ విశ్వ నగరంగా తీర్చిదిద్దారన్నారు. అనంతరం డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ మల్కాజ్గరి
పార్లమెంటు నియోజకవర్గం బిజెపి, కాంగ్రెస్ నాయకులకు రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందన్నారు. ప్రజా సమస్యలను పక్కన బెట్టి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను చేస్తుందని విమర్శించారు. మే 13వ తేదీన జరిగే పార్లమెంటు ఎన్నికల్లో రాగిడి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించు కోవాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నర్సింహా రెడ్డి,బొర్రా చందు ముదిరాజ్, డివిజన్ అధ్యక్షులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
……………

Related Posts

You cannot copy content of this page