హుజూర్ నగర్ ప్రభుత్వ ఐ.టి.ఐ కి రూ. 41.28 కోట్లు మంజూరు : నీటి పారుదల & పౌరసఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

Spread the love

హుజూర్ నగర్ లో ఏటా 110 మంది విద్యార్థులకు లాభం చేకూరేలా ప్రభుత్వం ఐటిఐ ఏర్పాటు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఐటిఐ లో పాత కోర్సులతో పాటు అదనంగా 5 రకాల కొత్త ట్రేడ్ లను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఫిట్టర్ లో రెండు యూనిట్లలో 40 మంది విద్యార్థులకు విద్యానభ్యసించే అవకాశం ఉంది. రెండేళ్ల వ్యవధి ఉండే ఈ కోర్సు ను ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేసింది. అలాగే ఎలక్ట్రీషియన్ ట్రేడ్ లో 2 యూనిట్లలో 40 మంది విద్యార్థులకు రెండేళ్ల విద్య, డ్రాఫ్ట్ మ్యాన్ సివిల్ ట్రేడ్ లో 2 యూనిట్లలో 40 మంది విద్యార్థులకు, డీజిల్ మెకానిక్ ట్రేడ్ లో 2 యూనిట్లలో 40 మంది విద్యార్థులకు, వెల్డర్ ట్రేడ్ లో 2 యూనిట్లలో 30 మంది విద్యార్థులకు ఒక ఏడాది కోర్సు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

ఈ ఐటిఐ లో ప్రభుత్వం సివిల్ పనులు, యంత్రాంగం, పరికరాలు, ట్రైనర్లు, మానవ వనరుల ఏర్పాటు కోసం అత్యవసర వ్యయం కింద 41.28 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. మొత్తం ప్రాజెక్ట్ వ్యయంతో ఎలక్ట్రిక్ వాహనాల నిర్వహణ, రోబోటిక్స్, ఆటోమెషీన్ సీఎడి సీఎఎం, సీఎన్ సి మెషీనింగ్, అడ్వాన్స్ ప్లంబింగ్ ఆడిటివ్ మానుఫ్యాక్చరింగ్ వంటి 23 స్వల్పకాలిక కోర్సులతో పాటు న్యూ ఢిల్లీలోని జాతీయ వృత్తి శిక్షణ మండలి (ఎన్.సి.టి.వి) ఆమోదించిన ఆరు దీర్ఘకాలిక ట్రేడ్స్ లో 40 అవసరాలకు అనుగుణంగా నూతన కోర్సులను ప్రవేశ పెట్టనుంది.

హుజూర్ నగర్ లో కొత్త కోర్సులతో పాటు పాత కోర్సులు 1. మానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమెషీన్, 2. ఇండస్ట్రియల్ రోబోటిక్స్ 1 ఏడాది కోర్సు మరియు డిజిటల్ మానుఫ్యాక్చరింగ్ ఒక యేడాది కోర్సు, 3.ఆర్టిజన్ యూజింగ్ అడ్వాన్సుడ్ టూల్స్ ఒక యేడాది, బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫైయర్ (మెకానికల్) 2 ఏళ్ల కోర్సు, అడ్వాన్స్ డ్ సి ఎన్ సి మెషీనింగ్ టెక్నీషియన్ రెండేళ్ల కోర్స్, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికిల్ రెండేళ్ల కోర్సు లు ఉంటాయి.

ఈ కోర్సుల కోసం 17 రెగ్యులర్ ఉద్యోగులను, 5 ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో హుజూర్ నగర్ లో ఐటిఐ ఏర్పాటు వల్ల 110 మంది విద్యార్థులకు సాంకేతిక విద్య అందుతుండడం తో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని స్థానిక ఎమ్మెల్యే, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. ఈ అవకాశాలను ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.

Related Posts

You cannot copy content of this page