ప్రజా సేవ చేస్తూ ప్రజల మనసు గెలుస్తున్న సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

Spread the love

Sunkireddy Raghavender Reddy is winning people’s hearts by doing public service

ప్రజా సేవ చేస్తూ ప్రజల మనసు గెలుస్తున్న సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి.ఈసారి మా ఎమ్మెల్యే మీరే అంటున్న నియోజకవర్గ ప్రజలు


కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల చూపు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి వైపు అలుపెరుగని బాటసారిలా సేవలు చేస్తూ ముందుకు వెళ్తున్న వ్యక్తి సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డిప్రాణం ఉన్నంతవరకు నా జీవితం ప్రజాసేవ కోసమే అంకితం అంటున్నారు. ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లోని వెల్దండ మండలం చౌదర్ పల్లి గ్రామానికి చెందిన ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి. ఒక ఎన్నారై ఉండి సేవ చేయాలని గుణంతో ఎనలేని సేవలు చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు.

తన ప్రాణం ఉన్నంతవరకు తన ప్రాంత బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు సేవ చేస్తూ ఉంటానని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని విద్య వైద్యం ఉపాధి పేదలకు అందించడమే లక్ష్యంగా తన ఐక్యత ఫౌండేషన్ పనిచేస్తున్నానని, కల్వకుర్తి నియోజకవర్గం లోని నిరుపేద ప్రజల కోసమే తాను శ్రమిస్తానని,నియోజకవర్గంలోని తమ సొంత ఇల్లు కట్టుకొని ఎక్కడ ఏ మనిషికి ఆపద వచ్చిన క్షణాల్లోఆదుకుంటానని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు.

ఆమనగల్లు లో ఐక్యత ఫౌండేషన్ ఆఫీసును ఏర్పాటు చేశానని పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ వెల్దండ. కల్వకుర్తిలో కూడా ఐక్యత ఫౌండేషన్ ఆఫీస్ ఓపెనింగ్ ఉంటుందని పేద ప్రజల కష్టాలు తీరుస్తానని రాఘవేందర్ రెడ్డి అన్నారు. ప్రతినిత్యం పేద ప్రజల బాగోగులు చూసుకోవడమే, పేద ప్రజలకు అందించాల్సిన సంక్షేమ పథకాలను కూడా తనకు అవకాశం ఇస్తే ప్రభుత్వ పాలన అధికారిగా కూడా అందిస్తానని సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు.

కల్వకుర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాలలో పాఠశాలలకు కావలసిన సామాగ్రి అందించడమే తన లక్ష్యమని, ఐక్యత ఫౌండేషన్ ద్వారా అందిస్తున్నామని, సామాగ్రి అందించడంతోపాటు నిరుపేద విద్యార్థిని, విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడం కోసం తాను కృషి చేస్తున్నానని అన్నారు.

అనారోగ్యం బారిన పడి ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించుకోవడానికి స్తోమత లేని పేద ప్రజలకు తన ఐక్యత ఫౌండేషన్ ద్వారా వైద్యం అందేలా చేస్తున్నానని అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనే తన లక్ష్యమని, కల్వకుర్తి నియోజకవర్గం లోని ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం కల్పించేలా చర్యలు తీసుకుంటానని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి తెలిపారు.

తాను అమెరికా నుంచి పురిటిగడ్డకు వచ్చింది కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి అని, పేద ప్రజల అభ్యున్నతికే పాటు పడతానని, రైతును రాజును చేయడమే తన లక్ష్యమని కల్వకుర్తి నియోజకవర్గం లోని ఏ ఒక్క నిరుపేద రైతుకు, నిరుపేద కుటుంబానికి, అన్యాయం జరగనివ్వనని, అందరినీ ఆదుకోవడానికి తానున్నానని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ రాఘవేందర్ రెడ్డి అన్నారు.

కల్వకుర్తి నియోజకవర్గం లోని ఏ ఒక్కరు అనారోగ్యం పాడిన పడిన, యాక్సిడెంట్లో కాలు చేతులు కోల్పోయిన, గ్రామాలలో, పట్టణాలలో ఏ ఒక్కరూ చనిపోయిన ఐక్యత ఫౌండేషన్ ద్వారా ఆర్థికంగా 5000 ఆర్థిక సాయం చేసి ఆదుకుంటున్నామని తెలిపారు.

Related Posts

You cannot copy content of this page