నారా చంద్రబాబు నాయుడు ని తక్షణమే సూపర్ హాస్పిటల్ కు తరలించి మంచి వైద్యం అందించాలి:బికె. పార్థసారథి

Spread the love

పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం R. మరవపల్లి తన స్వగృహం నందు విలేకరుల సమావేశం నిర్వహించాడు ఈ సమావేశంలో మాట్లాడుతూ

ప్రజా నాయకుడు చంద్రబాబు పై అక్రమ కేసులు బనాయించి 34 రోజులుగా జైలుకే పరిమితం చేసిన జగన్ రెడ్డి అక్కడ కనీస సౌకర్యాలు కల్పించకుండా ఇబ్బందులు పాలు చేయడం దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నాం

మా నాయకుడు క్రమశిక్షణతో కూడిన ఆహారపు అలవాట్లు కలిగిన చంద్రబాబు ని ఆరోగ్యపరంగా దెబ్బకొట్టి ప్రజాక్షేత్రంలోకి రానివ్వకుండా ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు

చంద్రబాబు గొంతెమ్మ కోరికలు ఏమి కోరడం లేదు దీర్ఘకాలంగా ఆయనకున్న చర్మ సంబంధిత సమస్య కారణంగా వేడి నీళ్లు అందించమని కోరారు కానీ వైసీపీ ప్రభుత్వం పట్టించుకొన్న పాపాన పోలేదు

నిన్నటి రోజున చంద్రబాబు కి టెస్టులు చేసిన డాక్టర్లు కాకుండా జైలు సూపరిండెంట్ హెల్త్ రిపోర్ట్ ఇవ్వడం దేనికి సంకేతం అన్నారు

చంద్రబాబు నాయుడు ఆరోగ్యం పై ప్రజల్లో సానుభూతి రాకుండా తప్పుడు నివేదికలతో జగన్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు

ఇప్పటికైనా కనీసం జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచి ప్రపంచ దేశాలు మెచ్చిన నాయకుడు చంద్రబాబు గారిని వెంటనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి లో చేర్పించి ఆయన కోలుకునే వరకు ఆసుపత్రిలోనే ఉంచాలని నిత్యం నిపుణుల బృందంతో పర్యావేశంలో ఉంచాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి రొద్దం నరసింహులు, జిల్లా మహిళా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, నియోజకవర్గ కమిటీ అధ్యక్షులు చిన్నప్పయ్య, ఇమామ్, తదితరులు పాల్గొన్నారు

Whatsapp Image 2023 10 13 At 4.09.45 Pm
Print Friendly, PDF & Email

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page