ఎన్నికల నియమ నిబంధనలకు అనుగుణంగా పాదర్శకత

Spread the love

ఎన్నికల నియమ నిబంధనలకు అనుగుణంగా పాదర్శకత, నిష్పక్షపాతంతో విధులు నిర్వర్తించాలి: గుంటూరు రేంజ్ ఐ.జి సర్వ శ్రేష్ట త్రిపాఠి…

ఎన్నికల కోడ్ అమలు, పాటించాల్సిన నియమాలు, పోలీస్ శాఖ తరుపున చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో సమావేశం నిర్వహించిన గుంటూరు రేంజ్ ఐ.జి…

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ అమలు, డ్యూటీల విషయంలో పాటించాల్సిన నియమాలు, పోలీస్ శాఖ తరుపున ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలు తదితర అంశాలపై ప్రకాశం జిల్లాలోని పోలీస్ అధికారులతో గుంటూరు రేంజ్ ఐ.జి సర్వ శ్రేష్ట త్రిపాఠి, ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్, మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గుంటూరు రేంజ్ ఐజి మాట్లాడుతూ: ఎన్నికలు సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, పోలీసు అధికారులు, సిబ్బంది ఎన్నికల ప్రవర్తనా నియమావళి (MCC) ని పాటిస్తూ పారదర్శకంగా విధులు నిర్వహించాలన్నారు. ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటుహక్కును వినియోగించుకునేలా చూడాలన్నారు. తదితర అంశాలు ప్రస్తావించారు…

Related Posts

You cannot copy content of this page