తాగునీటిని సరఫరా చేసే దిశగా పనులు వేగవంతం !!
— ఎమ్మెల్యే పేర్ని నాని

Spread the love

తాగునీటిని సరఫరా చేసే దిశగా పనులు వేగవంతం !!
— ఎమ్మెల్యే పేర్ని నాని
సాక్షిత : మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి ఇబ్బందులు పరిష్కారం చూపి నగర ప్రజలకు 24 గంటల పాటు తాగునీటిని సరఫరా చేసే దిశగా పనులు వేగవంతం చేశామని మాజీ మంత్రివర్యులు, కృష్ణాజిల్లా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు.

  మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని తాగునీటి పైప్‌ లైన్‌ నిర్మాణ పనులకు మంగళవారం ఉదయం ఆయన 6, 9 , 31, 47 వ డివిజన్లలో పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. తొలుత ఆయన స్థానిక 6 వ డివిజన్ గాంధీనగర్ లో  బెల్ కంపెనీ గెస్ట్ హౌస్ రోడ్డు కలెక్టర్ ఆఫీస్ సమీపంలోని ఓవర్ హెడ్ ట్యాంక్ వద్ద  రూ  25 లక్షల వ్యయంతో 2,400 మీటర్ల దూరం 110 ఎం ఎం వ్యాసార్థం గల నూతన పైప్ లైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పేర్ని నాని  భూమిపూజ చేశారు. అనంతరం 9 వ డివిజన్ నరసింహారావు నగర్ కలెక్టర్ ఆఫీస్ రోడ్డు ధర్నాచౌక్ సమీపంలో  రూ 8 లక్షల రూపాయలతో 662 మీటర్ల నూతన పైప్ లైన్ కు శంఖుస్థాపన చేశారు. తర్వాత 31 వ డివిజన్ పరిధిలోని టైలర్స్ కాలనీలో రూ 4 లక్షల వ్యయంతో  410 మీటర్ల పైప్ లైన్ పనులను లాంఛనంగా ప్రారంభించారు. స్థానిక 47 వ డివిజన్ పరిధిలోని ఈడేపల్లి శక్తి గుడి వెనుకన గల రోడ్ నందు సుమారు 5 లక్షల వ్యయంతో నిర్మించబోతున్న 365 మీటర్ల నూతన పైప్ లైన్  నిర్మాణ పనులకు  శాసన సభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని)  శంకుస్థాపన చేశారు. 


  అనంతరం ఎమ్మెల్యే పేర్ని నాని మాట్లాడుతూ, గతంలో గాంధీనగర్ వాసులు నీటి కుళాయి కనెక్షన్ కావాలంటే, పలు ఇబ్బందులు పడేవారని, లక్ష్మి టాకీస్ కూడలి వద్ద గల ప్రధాన పైప్ లైన్ నుంచి ఎంతో వ్యయప్రయాసలతో తీసుకోవాల్సి వచ్చేదన్నారు. జిల్లా పరిషత్ వరకు ఉన్న నాలుగు వీధులలో మునిసిపల్ పంపు ఏర్పాటుచేసుకోవాలంటే, ఎంతో దూర భారమే కాక ఆర్ధికంగా ఎంతో ఖర్చు ఆయా గృహస్తులకు అయ్యేదని, ఆ ఇబ్బంది ఇక పూర్తిగా  తొలిగిపోనుందని 4 అంగుళాల తాగునీటి పైప్ లైన్ ప్రతి సందులోకి ఏర్పాటు కానున్నట్లు తెలిపారు. అదేవిధంగా స్థానిక శారదానగర్‌ ప్రాంతంలో గతంలో మున్సిపల్‌ ట్యాంకర్లతో నీటి సరఫరా మినహా కుళాయి ద్వారా నీరు లభ్యమయ్యేవి కాదన్నారు. ఎంతోకాలంగా తాగునీటి ఇక్కట్లు ఆ ప్రాంతంలో అత్యధికమమన్నారు. దివంగత  మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ శారదానగర్‌లో మంజూరైందన్నారు. పంపుల చెరువు నుంచి నాటి పైప్‌ లైన్‌ పాతది కావడం , వ్యాసార్థం చిన్నగా ఉండటం శారదానగర్‌ ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ను తాగునీటితో నింపేందుకు అత్యధిక సమయం పడుతోందన్నారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన రూ.45 కోట్ల తాగునీటి పథకంలో భాగంగా టైలర్స్‌ కాలనీ, ఖాలేఖాన్‌ పేటల్లో నూతన ఓవర్‌ హెడ్‌ రిజర్వాయర్లు త్వరలో నిర్మాణం పూర్తి  కానున్నాయన్నారు.  గత కొంతకాలంగా శారదానగర్‌ , టైలర్స్‌ కాలనీ, ఖాలేఖాన్‌ పేట , శివగంగ ప్రాంత ప్రజలు పడుతున్న తాగునీటి ఇబ్బంది ఇకపై  తొలిగిపోనున్నట్లు ఎమ్మెల్యే పేర్ని నాని తెలిపారు. ఈ సమస్య పరిష్కారం కోసం నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికు కతజ్ఞతలు తెలిపారు.

  ఈ  పైప్ లైన్ల శంఖుస్థాపన  కార్యక్రమాలలో మేయర్  మోకా వెంకటేశ్వరమ్మ ,డిప్యూటీ మేయర్ తంటీపూడి కవిత, డిప్యూటీ మేయర్ లంకా సూరిబాబు, ముడా ఛైర్మెన్ బొర్రా నాగ దుర్గా భవాని విఠల్, మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ షేక్ ముస్తఫా  ( అచ్చేబా ), మాజీ జడీపీటీసి సభ్యులు లంకె వెంకటేశ్వరావు ( ఎల్వియార్ ),  అర్బన్ బ్యాంక్ చైర్మన్ పల్లపోతు సుబ్రహ్మణ్యం, 6 డివిజన్ కార్పొరేటర్ పర్ణం సతీష్, 9 డివిజన్ కార్పొరేటర్  రాసంశెట్టి జానకీ రామ్ వాణిశ్రీ , 31 డివిజన్ కార్పొరేటర్ యండ్రపాటి నాగేశ్వరరావు, 47  డివిజన్ కార్పొరేటర్ గౌర నాగ పార్వతి శ్రీహరి, 38 వ డివిజన్ కార్పొరేటర్ శ్రీకాకుళం రేణుకా రాణి,  49 వ డివిజన్ కార్పొరేటర్ పల్లి శేఖర్, వైఎస్సార్సీపీ నాయకులు బూరగడ్డ రమేష్ నాయుడు, కొల్లు రమేష్, కొక్కిలిగడ్డ శరత్ బాబు, జోగి రామకృష్ణ, చిటికెన నాగేశ్వరరావు, మహమ్మద్‌ రఫీ, మహమ్మద్ బాషా, బందెల థామస్‌ నోబుల్‌, మిరియాల రాంబాబు, తిరుమలశెట్టి ప్రసాద్, మన్నే శేషయ్య, నూకల ప్రసాద్, వివిధ డివిజన్ ల కార్పొరేటర్ లు, ఇంఛార్జి లు, కో - ఆప్షన్ సభ్యులు బేతపూడి రవి , మట్టా తులసమ్మ, మునిసిపల్ ఇంజినీర్ శ్రీకాంత్ , ఆర్ డబ్ల్యు ఎస్  జె ఈ  ఎం. సుగుణ, మునిసిపల్ డిఈ, ఏఈ తదితర అధికారులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page