గుడివాడలో కోటి 65లక్షలతో సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన వైఎస్ఆర్సిపి నేతలు

Spread the love

వైఎస్ఆర్సిపి హయంలో గుడివాడ చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి పనులు జరిగాయి- నాయకులు

-ఎమ్మెల్యే కొడాలి నాని కృషితో వేలాదికోట్లతో గుడివాడలో జరుగుతున్న అభివృద్ధి ప్రతిపక్షాలకు కనిపించదు…. వారి ధ్యాసంతా ప్రజలకు కలిగే ప్రయోజనాలను అడ్డుకోవడమే

గుడివాడ: గుడివాడ పట్టణంలో కోటి 65లక్షల విధులతో నిర్మించనున్న సిసి రోడ్ల నిర్మాణ పనులకు వైఎస్ఆర్సిపి నాయకులు శనివారం శంకుస్థాపన చేశారు.5వ వార్డు పరిధిలోని చిన్నకారుల స్టాండ్ వద్ద నుండి బ్రహ్మకుమారి స్ట్రీట్ వరకు 83 లక్షలతో సిసి రోడ్డు, 15వ వార్డు పరిధిలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి ముబారక్ సెంటర్ వరకు 82 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సిసి రోడ్లకు పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శీను, జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు తదితర నేతలతో కలిసి భూమి పూజ చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు. సీఎం జగన్ సహకారంతో గుడివాడ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ఎమ్మెల్యే కొడాలి నాని అన్ని విధాలుగా కృషి చేశారని పార్టీ నాయకులు అన్నారు.

ఎమ్మెల్యే నాని కృషి ఫలితంగా గుడివాడ రూపు రేఖలు మారిపోయేలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు తమ రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ మట్టా నాగమణి జాన్ విక్టర్,మాజీ కౌన్సిలర్ రావుల కొల్లు హైమావతి, నందివాడ ఎంపిపి పెయ్యల అదాం,మార్కెటింగ్ యాడ్ వైస్ చైర్మన్ చింతల భాస్కరరావు, డాక్టర్స్ సెల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మలిరెడ్డి రవి,పార్టీ నాయకులు పాలేటి చంటి, రావులకొల్లు నాగమల్లేశ్వరరావు, రావులకొల్లు సుబ్రమణ్యం, కొఠారి గౌతమ్ చాంద్, వరుకుల బాలకృష్ణ,మైనార్టీ అధ్యక్షుడు షేక్ బాజీ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు రేమల్లి నీలాకాంత్, మొండ్రు వెంకటేశ్వరరావు ,మామిళ్ళ ఎలీషా, వెంపటి సైమన్, తాళ్లూరి ప్రశాంత్, మద్దాలి సురేఖ, నాయకులు లోయ రాజేష్, చుండూరి శేఖర్,మామిల్ల రాజేష్, దారం నరసింహారావు, మూడేడ్ల ఉమా,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరియు అభిమానులు , సచివాలయ కన్వీనర్ లు , గృహ సారధులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page