సాక్షిత.. సికింద్రాబాద్ : డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ నియోజకవర్గం లోని బౌద్దనగర్ డివిజన్లో విస్తృతంగా పర్యటించి సుమారుగా రూ.2 కోట్ల ఖర్చుతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. స్థానిక కార్పొరేటర్ శ్రీమతి కంది శైలజ అధికారులు, నేతలతో కలిసి అంబర్ నగర్, ఎల్ నారాయణ నగర్, ఈశ్వరి బాయి నగర్, బౌద్ధనగర్, వారసిగుడా, అశోక్ నగర్, సంజీవ పురం తదితర ప్రాంతాల్లో పాదయాత్రను నిర్వహించారు. బీ ఆర్ ఎస్ యువ నేతలు తీగుల్ల కిషోర్ కుమార్, రామేశ్వర్ గౌడ్, తో పాటు నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ మాట్లాడుతూ సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని కోట్ల రూపాయల ఖర్చుతో అభివృద్ధి చేశామని తెలిపారు. ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించామని, అభివృద్దిని నిరంతర ప్రక్రియగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలు ఓ వైపు, తాము చేపడుతున్న అభివృద్ధి పనులు మరో వైపు సికింద్రాబాద్ ప్రజానీకం నుంచి తాము మెప్పును పొందేలా దోహదపడుతున్నాయని తెలిపారు. కేవలం ఎన్నికల ముందే ప్రజల్లో నిలిచేలా కాకుండా నిరంతరం ప్రజలతో తాము మమేకమవుతున్నామని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
సుమారుగా రూ.2 కోట్ల ఖర్చుతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు.
Related Posts
వినాయకునికి ప్రత్యేక పూజలు
SAKSHITHA NEWS వినాయకునికి ప్రత్యేక పూజలు || కుత్బుల్లాపూర్నియోజకవర్గం 128 డివిజన్ చింతల్ వాసులు నిర్వహించిన వినాయక ఉత్సవాలకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా వినాయకుని ప్రత్యేక పూజలో పాల్గొని ప్రజలందరూ ఆయువు…
పెద్దపెల్లి జిల్లాలో రేపు డిప్యూటీ సీఎం పర్యటన
SAKSHITHA NEWS పెద్దపెల్లి జిల్లాలో రేపు డిప్యూటీ సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్న రామగుండం సిపి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ పెద్దపల్లి జిల్లా :పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కోసం తెలం గాణ ఉప ముఖ్యమంత్రి మల్లు…