లింగసానిపల్లి గ్రామ సమస్యను మూడేళ్లుగా పట్టించుకుని సర్పంచ్. ఉప సర్పంచ్. డి

Spread the love

The sarpanch has been taking care of the Lingasanipalli village problem for three years. Deputy Sarpanch d

లింగసానిపల్లి గ్రామ సమస్యను మూడేళ్లుగా పట్టించుకుని సర్పంచ్. ఉప సర్పంచ్.

సాక్షిత ప్రతినిధి.నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం లింగసాని పల్లి లోని 4 వ వార్డు లోని సమస్యలను పరిష్కరించాలని కాలనీ యువకులు పంచాయతీ సెక్రటరీ సురేష్ గౌడ్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు.

4 వ వార్డు లో అనేక సమస్యలు ఉన్నాయని, సరైన రోడ్డులు లేవని, వీధిదీపాలు లేవని, మరో వైపు మురుగు నీరు, ఇలా పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని సెక్రటరీ దృష్టికి తీసుకొచ్చారు.

అనంతరం మాట్లాడిన యువకుడు గన్నోజు గణేష్ 4 వ వార్డులోని సమస్యల గురించి గత మూడేళ్ళుగా గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, గతం లో పని చేసిన కార్యదర్శి కి విన్నవించుకున్నా పట్టించి కోలేదని ఆవేదన వ్యక్తం చేసారు. సమస్యలు పరిష్కరించ కుండా కక్ష పూరితంగా వ్యవహ రిస్తున్నారని ఆరోపించారు.

వార్డు సమస్యల ఫై మళ్ళి ఇప్పడు సెక్రటరీ కి వినత పత్రం ఇచ్చామని, సమస్యలను పరిష్కరిస్తామని అయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వార్డు సమస్యలను పరిష్కరించాలని కోరారు.

Related Posts

You cannot copy content of this page