విద్యార్థులు సమాచార హక్కు చట్టంపై సంపూర్ణ అవగాహన

Spread the love

Students have thorough understanding of Right to Information Act

విద్యార్థులు సమాచార హక్కు చట్టంపై సంపూర్ణ అవగాహన కలిగి వుండాలి.

సమాచార హక్కు చట్టం కమిషనర్.

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

విద్యార్థులు సమాచార హక్కు చట్టంపై సంపూర్ణ అవగాహన కలిగి వుండాలని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమీషనర్ డా. గుగులోతు శంకర్ నాయక్ పేర్కొన్నారు.


శనివారం ఎస్.ఆర్. అండ్.బి.జి.ఎన్.ఆర్ సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాలలో సమాచార హక్కు- 2005పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో కమీషనర్ మాట్లాడాతు పట్టుదల ఉంటే దేన్నయినా సాధించగలమనే ధృడ సంకల్పంతో ముందుకు వెళ్లాలని విద్యార్థులకు రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమీషనర్ డా. గుగులోతు శంకర్ నాయర్ దిశా నిర్దేశం చేశారు.

తాను మారుమూల తండాలో జన్మించి ఖమ్మం జిల్లాలో ఇదే ప్రభుత్వ కళాశాలలో విద్యనభ్యసించి పట్టుదలతో నేడు రాష్ట్ర సమాచార హక్కు కమీషన్ చైర్మన్ స్థాయికి ఎదగడం జరిగిందని ఆయన తెలిపారు. విద్యతోనే గౌరవం లభిస్తుందని, విద్యార్ధి దశ నుండే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అద్యాపకులు విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను, ప్రతిభలను వెలికి తీసే విధంగా విద్యాబోధన జరగాలన్నారు. సమాచార హక్కు చట్టం.

సామాన్యుని చేతిలో వజ్రాయుధం లాంటిదని ప్రభుత్వ పాలనలో పారదర్శకత, అధికార యంత్రాంగంలో జవాబుదారితనంతో ప్రజలు కోరిన సమాచారాన్ని సెక్షన్ (3) ప్రకారం చిన్న, పెద్ద, ధనిక, పేద అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి సమాచార హక్కు చట్టం ఉపయోగించుకునే విధంగా పొందుపర్చడం జరిగింది. 30 రోజుల కాలంలో ఇవ్వాలని, దరఖాస్తుదారులు కోరిన సమాచారాన్ని అందించాలని సెక్షన్ 7(1) ప్రకారం. 30 రోజుల కాల వ్యవధిలో సమాచారం ఇవ్వని యెడల, మొదటి అప్పీల్ చేసుకోవడానికి ప్రజలకు అవగాహన కల్పించవలసిన అవసరం ఉందని అన్నారు.

30 రోజుల వ్యవధిలో సమాచారం ఇవ్వని క్రమంలో సెక్షన్ 19 (1) ప్రకారం మొదటి అప్పీల్ చేసుకుంటే మొదటి అప్పిలేట్ అధికారి సమాచారం విచారణ చేపట్టి ఇప్పించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.

మొదటి అప్పిలేట్ అథారిటి ఉంది, పరిష్కారం చేయని యెడల సెక్షన్ 19(3) ప్రకారం రాష్ట్ర సమాచార కమిషనర్ దరఖాస్తు చేసుకోవాలని ఆయన అన్నారు. ఇట్టి జాప్యాన్ని తొలగించి, విద్యార్థులు, ప్రజల్లో చైతన్యం నింపేందుకు, 30 రోజుల కాల వ్యవధిలో సమాచారం అందించే విధంగా కమిషన్ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

పౌరులకు సమాచారం అందచేయడం, సత్వర పరిష్కారానికి రాష్ట్ర కమీషన్ చర్యలు చేపడుతుందన్నారు. దరఖాస్తుదారులు తెలంగాణ రాష్ట్ర కమిషన్ సెకండ్ అప్పిలేట్ ఆధారిటికి దరఖాస్తు చేస్తే, రాష్ట్ర కమీషన్ మూడు నుంచి ఆరు నెలల లోపే కేసు విచారణ చేపట్టి సమాచారం అందిస్తూ, విజయవంతంగా ముందుకు వెళ్తుందని అన్నారు.

సమాచార హక్కుచట్టంపై యువతకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటుహక్కు ఎలా ఉపయోగించుకుంటున్నామో, సమాచారహక్కు చట్టాన్ని కూడా అదే తరహాలో సర్వినియోగ పరుచుకోవాలన్నారు.


కళాశాల ప్రిన్సిపల్ డా॥మహ్మద్ జాకిరుల్లా, అధ్యాపకులు బి. వెంకటేశ్వరరావు, రత్న ప్రసాద్, డా; జాన్ మిల్టన్, సీతారాం, గోపి, రమేష్, నాగూరు, సత్యవతి, విద్యార్థులు తదితరులు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page