ప్రశాంతంగా ముగిసిన కానిస్టేబుల్ / ఎస్సై అభ్యర్థుల దేహధారుడ్య పరీక్షలు..

Spread the love


Physical examination of constable / ssi candidates ended peacefully..

ప్రశాంతంగా ముగిసిన కానిస్టేబుల్ / ఎస్సై అభ్యర్థుల దేహధారుడ్య పరీక్షలు..
22 రోజుల పాటు కొనసాగిన దేహధారుడ్య పరీక్షలు.. 21809 మంది అభ్యర్థులు హాజరు

తుది పరిక్షలకు అర్హత సాధించిన 12567 మంది అభ్యర్థులు..

పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ ను పోలీస్ కమిషనర్ తో కలసి సందర్శించిన జిల్లా కలెక్టర్..

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో స్ట్ఫైండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్స్, కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా 22 రోజుల పాటు కొనసాగిన దేహదారుఢ్య పరీక్షలు నేటితో ముగిసిందని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు.


మంగళవారం జరిగిన దేహదారుఢ్య పరీక్షలకు 939 మంది హజరై ఈవెంట్లలో పాల్గొన్నారని,
ఇందులో 605 మంది అభ్యర్థులు తుది పరిక్షలకు అర్హత సాధించారని తెలిపారు. 22 రోజుల్లో 21809 మంది అభ్యర్థులు దేహధారుడ్య పరీక్షలకు హజరైయ్యారని,


ఇందులో 12567 మంది అభ్యర్థులు తుది పరీక్షలకు అర్హత సాధించారని తెలిపారు. దేహధారుడ్య పరీక్షలు జరుగుతున్న పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ ను పోలీస్ కమిషనర్ తో కలసి సందర్శించిన


జిల్లా కలెక్టర్ వీపీ. గౌతమ్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ రాధిక గుప్త కి పోలీస్ ఉద్యోగాల ఎంపికలో పక్రీయలో భాగంగా కొనసాగుతున్న దేహధారుడ్య పరీక్షల తీరును కలెక్టర్ కి పోలీస్ కమిషనర్ వివరించారు.
ఖమ్మం పోలీస్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్స్ లో డిసెంబర్ 8 వతేది నుండి జనవరి 3 వరకు ఉదయం 5 గం॥ నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిన ఈ పరీక్షలలో ఎక్కడ కూడా మానవ ప్రమేయం లేకుండా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ రైడర్ ప్యాడ్లను ఉపయోంచడం ద్వారా ఎక్కడా ఎలాంటి ఆరోపణలకు, అక్రమాలకు ఆస్కారం లేకుండా పకడ్బంది ప్రణాళికతో సీసీ కెమెరాల పర్యవేక్షణలో పూర్తి పారదర్శకంగా రిక్రూట్మెంట్ పక్రీయ కొనసాగిందని పోలీస్ కమిషనర్ తెలిపారు.


ఎంపిక ప్రక్రియ సజావుగా పూర్తి చేయడంలో అంకితభావంతో భాధ్యతలు పోలీసు సిబ్బంది,
మినిస్ట్రీయల్ స్టాఫ్, పి.ఈ.టి, వైద్య సిబ్బందికి, మ్యాగ్నిటిక్ ఇన్ఫోటిక్ ప్రవేటు లిమిటెడ్ టెక్నికల్ సిబ్బంది, ఐ.టి కోర్ సిబ్బంది, పిటిక్ సిబ్బందికి


పోలీస్ కమిషనర్ చేతుల మీదుగామ ” ప్రశంసా పత్రాలను” అందజేశారు.
మొత్తం అభ్యర్థులు – 24726 పాల్గొన్న అభ్యర్థులు-21809
తుది పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థులు- 12567 కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్ , ఏ ఎస్ పి అక్షాంశ్ యాదవ్ , ఏసీపీలు ప్రసన్న కుమార్ , అంజనేయులు, భస్వారెడ్ధి ,వేంకటేశ్, రహెమాన్, వెంకటస్వామి, రవి, బాబురావు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page