SAKSHITHA NEWS

మల్కాజిగిరి నియోజకవర్గం మిర్జాల్ గూడ కి చెందిన కిషోర్ చారి, గతంలో రెండు కిడ్నీలు పాడవడంతో, గత సంవత్సరం జీవన్ దారా ద్వారా ప్రభుత్వ సహకారంతో ఒక కిడ్నీను అమర్చుకోవడం జరిగింది. ఒక కిడ్నీ అమర్చాక కూడా తరచూ కిడ్నీ సమస్య వల్ల అనారోగ్య పాలవుతున్నాడు. గత పది రోజుల ముందు, ఔషధాలు వికటించి అపస్పారిక స్థితిలోకి వెళ్లడంతో నిమ్స్ హాస్పత్రిలో కిషోర్ సతీమణి చేర్చడం జరిగింది.

గురు స్వామి అరవింద్ రెడ్డి కిషోర్ చారి వైద్య ఖర్చుల కోసం ఇబ్బంది పడుతున్న విషయాన్ని శ్రీ ధర్మశాస్త్ర సేవా సమాజం ప్రతినిధి కుమ్మరి రాజుకు తెలియజేయడంతో, సదర విషయాన్ని శ్రీ ధర్మశాస్త్ర సేవా సమాజం, మల్కాజ్గిరి అయ్యప్ప సేవా సంఘం, అయ్యప్ప సేవా సమితి వినాయక నగర్, గ్రూప్ లలో కిషోర్ చారి విషయాన్ని తెలుపుతూ అతని వైద్యానికి సహాయం కోరారు. మానవతా దృక్పథంతో మూడు గ్రూప్ ల నుండి 32 మంది అయ్యప్ప భక్తుల 26062 రూపాయలు విరాళంగా అందించారు, బుధవారం నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కిషోర్ చారి కి సేకరించిన విరాళాన్ని అందజేయడం జరిగింది. తన వైద్యానికి సహాయం అందజేసిన అయ్యప్ప భక్తులందరికీ కిషోర్ చారి వారి సతీమణి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కుమ్మరి రాజు, విగ్నేశ్వర్ గౌడ్, మహమ్మద్ రషీద్ పాల్గొన్నారు.


SAKSHITHA NEWS