శ్రీ రాముని జీవితం ప్రపంచ మానవాళికి ఆదర్శం..: నీలం మధు ముదిరాజ్..

Spread the love

శ్రీ రాముని జీవితం ప్రపంచ మానవాళికి ఆదర్శం..: నీలం మధు ముదిరాజ్..
చిట్కుల్ లో గడప గడపకు రామ మందిర అక్షింతల పంపిణీ…

సాక్షిత : శ్రీరాముని జీవితం సర్వ ప్రపంచ మానవాళికి ఆదర్శనీయమని ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు.
చిట్కుల్ గ్రామంలో అయోధ్య శ్రీరాముని కి చెందిన అక్షింతలను గడపగడపకు పంపిణీ చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయోధ్యలో ఈ నెల 22 న రామ మందిర ప్రారంభోత్సవం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగానే అయోధ్య శ్రీరాముడికి చెందిన అక్షింతలను ప్రజలకు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. ఆ అయోధ్య శ్రీరాముడి మందిర స్థాపన కార్యక్రమాన్ని వేయి కన్నులతో చూడడానికి హిందూ బంధువులందరు ఆసక్తితో ఎదురు చేస్తున్నారన్నారు. కన్నుల పండుగ జరిగే ఈ కార్యక్రమన్ని ప్రతి ఒక్కరూ సామాజిక మాధ్యమాల ద్వారా అయిన తిలకించి ఆ శ్రీరాముడి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు,ప్రజలు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2024 01 06 At 5.40.37 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page