రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో మలబార్ గ్రూప్

Spread the love

రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో మలబార్ గ్రూప్ ఏర్పాటు చేయనున్న బంగారం, వజ్రాల ఆభరణాల తయారీ యూనిట్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.

సాక్షిత : ₹750 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ కర్మాగారం మలబార్ గోల్డ్ & డైమండ్స్ యొక్క అతిపెద్ద ఆభరణాల తయారీ యూనిట్‌గా నిలువనుంది. ఈ పెట్టుబడితో 2,750 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

మలబార్ గోల్డ్ & డైమండ్స్ కు తెలంగాణలో ప్రస్తుతం 17 రిటైల్ షోరూమ్‌ లు ఉండగా, వెయ్యి మందికి పైగా ఉద్యోగులు వీటిలో పనిచేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ , పరిశ్రమల శాఖ డైరెక్టర్ కృష్ణ భాస్కర్, మలబార్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ అహమ్మద్ ఎం.పీ., వైస్ ఛైర్మన్ అబ్దుల్ సలామ్ కే.పి. పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page