తెలంగాణలో నీలి విప్లవం మత్య్సకారుల ఆర్థికాభివృద్దే ప్రభుత్వ లక్ష్యం

Spread the love

Blue revolution in Telangana is the government’s objective for the economic development of fishermen

తెలంగాణలో నీలి విప్లవం
మత్య్సకారుల ఆర్థికాభివృద్దే ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ


సాక్షిత : కొండాపూర్ డివిజన్ పరిధిలోని దుర్గం చెరువులో కి రాయదుర్గం ఫిషర్ మెన్ కో అపరేటివ్ వారి ఆధ్వర్యంలో 70,000 చేప పిల్లలను కార్పొరేటర్లు హమీద్ పటేల్ , మాజీ కార్పొరేటర్ సాయి బాబా తో కలిసి చెరువులోకి చేప పిల్లలను వదిలిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ రాయదుర్గం ఫిషర్ మెన్ కో అపరేటివ్ వారి ఆధ్వర్యంలో దుర్గం చెరువులో చేప పిల్లలను విడుదల చేయడం జరిగినది అని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పంపిణీ చేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ మత్స్యకారులకు ఒక వరమని, అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో మత్స్య సంపద పెరగడానికి ఎంతగానో కృషి చేస్తున్నారని ,మత్స్యకారులకు రాయితీపై వాహనాలు, వలలు, తెప్పలు, ఇతర సామాగ్రిని సబ్సిడీ పై అందజేస్తున్నారని అన్నారు.

నీలి విప్లవం సాధనలో భాగంగా నీలి తెలంగాణ సాధనకై ముందుకు అడుగులు వేయడానికి ఎంతగానో దోహదపడుతుంది అని దానిలో భాగంగా ఉచిత చేపలు పంపిణి చేసి మత్స్య కారులను ఆదుకుంటుందని ,మత్స్య కారుల జీవితాల్లో వెలుగును నింపుతున్నారని,రిజర్వాయర్లు, ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో సొసైటీల్లో ఉన్న మత్స్యకారులకు చేపలు పట్టుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారని అన్నారు.ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు .

అదేవిదంగా ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోని సామాజిక బాధ్యత చెరువులను పరిరక్షించాలని ,చెరువుల సంరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ,నియోజకవర్గంలోని అన్ని చెరువులను సుందరీకరించి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందిస్తామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు .

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, బీఆర్ ఎస్ నాయకులు ప్రసాద్, శ్రవణ్ యాదవ్, రాజు యాదవ్,రాయదుర్గం ఫిషర్ మెన్ కో అపరేటివ్ సభ్యులు శ్రీశైలం, అశోక్, సురేష్ మరియు తదితరులు పాల్గొన్నారు..

Related Posts

You cannot copy content of this page