తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు

Spread the love

After the formation of Telangana state many development and welfare programs

సాక్షిత : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం సనత్ నగర్ లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డులను లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలనేది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లక్ష్యం అని తెలిపారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు 2016, వికలాంగులకు 3016 రూపాయలు చొప్పున ప్రతి నెల వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని వివరించారు. రాష్ట్ర ఆవిర్భావం కు ముందు 200 , 500 రూపాయల పెన్షన్ ను ఇచ్చే వారని, వాటి కోసం లబ్ధిదారులు అనేక అవస్థలు పడేవారని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలను నిర్వహిస్తున్న నేపధ్యంలో నూతనంగా మరో 10 లక్షల మందికి పెన్షన్ లను మంజూరు చేసినట్లు చెప్పారు.

గతంలో 65 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ లను ఇవ్వడం జరిగిందని, దానిని 57 సంవత్సరాలకు తగ్గించి పెన్షన్ లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ లు అందుతాయని మంత్రి స్పష్టం చేశారు. ఇదే కాకుండా పేదింటి ఆడపడుచుల పెండ్లికి దేశంలో ఎక్కడా లేని విధంగా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ల క్రింద లక్ష 116 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. గర్భిణీ మహిళలకు KCR కిట్ క్రింద పాప పుడితే 13 వేలు, బాబు పుడితే 12 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. ఇవే కాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. సనత్ నగర్ లో మంచి నీటి రిజర్వాయర్ నిర్మాణం, 5 కోట్ల తో ఇండోర్ స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం, రహదారుల అభివృద్ధి, ఎక్కడా ఎలాంటి లీకేజీలు లేకుండా సీవరేజ్ పైప్ లైన్ ల ఏర్పాటు వంటి అనేక అభివృద్ధి పనులు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు.

ముఖ్యమంత్రి KCR నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు కొలన్ లక్ష్మీ, మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, ఉప్పల తరుణి, RDO వసంత, MRO విష్ణు సాగర్, TRS డివిజన్ అధ్యక్షులు కొలన్ బాల్ రెడ్డి, హన్మంతరావు, నాయకులు సురేష్ గౌడ్, అశోక్ యాదవ్, ఖలీల్, శేఖర్, గుడిగే శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page