తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 18 వ తేదీన చేపట్టనున్న 2వ విడత కంటి వెలుగు

Spread the love

The Telangana State Government will undertake the 2nd phase of Kanti Velam on the 18th of this month

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 18 వ తేదీన చేపట్టనున్న 2వ విడత కంటి వెలుగు అవగాహన కార్యక్రమం పై మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో జోనల్ కమిషనర్ శంకరయ్య , డీసీ వెంకన్న, డిప్యూటీ DMHO శ్రీమతి సృజన , కార్పొరేటర్లు హమీద్ పటెల్ , రాగం నాగేందర్ యాదవ్ , జగదీశ్వర్ గౌడ్ , దొడ్ల వెంకటేష్ గౌడ్ , నార్నె శ్రీనివాసరావు ఉప్పలపాటి శ్రీకాంత్ , గంగాధర్ రెడ్డి , శ్రీమతి రోజాదేవి రంగరావు , శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి మరియు అధికారులతో కలిసి సమీక్షా సమావేశం జరిపిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకం మొదటి దశ విజయవంతం అయినది అని, వృద్దుల కోసం ,కంటి సమస్యలు ఉన్న వారి కోసం వారి జీవితాలలో వెలుగులు నింపాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 18 వ తేదిన నుండి రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అని, దానికి సంబందించిన కార్యక్రమాల ఏర్పాట్ల పై కంటి వెలుగు అవగహన సదస్సు, సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగినది

అని, మన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కంటి వెలుగు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది అని, కంటి వెలుగు శిబిరాల ఏర్పాట్లు తీసుకోవల్సిన చర్యల పై సమీక్షా సమావేశం జరపడం జరిగినది అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఇవి గాక అవసరమైతే అదనంగా మరిన్ని కేంద్రలను ఏర్పాటు చేస్తామని, 100 రోజుల పాటు ప్రత్యేక శిబిరాలను ఏర్పటు చేసి ప్రజలందరికీ వైద్యం అందిస్తామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరు సద్వినియోగపర్చుకోవలని, కంటి వెలుగు సెంటర్ లో ఉచిత కంటి పరిక్షలు ,చేసి అవసరమైన వారికి కళ్ళద్దాలు, పంపిణీ చేస్తారు అని, అవసరమైన వారికి కంటి అపరేషన్ లు నిర్వహించడం జరుగుతుంది అని గతంలో మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమంలో మన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో దాదాపు 1,83,000 మందిని పరిశీలించి 40000 మందికి కళ్ళ అద్దాలు ఇవ్వడం జరిగినది ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు.

అదే స్పూర్తితో రెండో దఫా కంటి వెలుగు ప్రారంభిస్తున్నాం. రాష్ట్రంలో అవసరం ఉన్న అందరికీ కంప్యూటరైజ్డ్ పరీక్షలు నిర్వహించి, పరీక్షల తో పాటు ఉచితంగా, మందులు, కళ్లద్దాలు ఉచితంగా ఇస్తున్నాం..ప్రతి కళ్ళ అద్దాల జోడులకు బార్ కోడ్ కూడా పెడుతున్నాం.ఎవరివి వారికే చేరేలా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నాం.

ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు క్యాంపులు నిర్వహణ ఉంటుంది, మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో 8 మంది వైద్య సిబ్బంది ఉంటారు. ఒక అప్టో మెట్రిస్ట్, ఒక సూపర్ వైజర్, ఇద్దరు ఏ ఎన్ ఎం, ముగ్గురు ఆశా, 1 డీఈవో టీంలో సభ్యులుగా ఉంటారు.*

ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్ పూర్తి చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు అయ్యేలా అందరం కృషి చేద్దాం.అధికారులు, ప్రజా ప్రతినిధుల చురుకైన భాగస్వామ్యం తోనే కార్యక్రమం విజయవంతం అవుతుందని సీఎం కేసీఆర్ ఉద్దేశ్యం కాబట్టి, అందరం కలిసి పని చేసి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఆయా డివిజన్ల లో ఈ కింది సెంటర్ లలో కంటి వెలుగు కేంద్రాల శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు. వాటి వివరాలు

  1. కొండాపూర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్ లోని సగర సంఘం కమ్యూనిటీ హాల్ , ప్రేమ్ నగర్ కమ్యూనిటీ హాల్ , మార్తాండ్ నగర్ ప్రభుత్వ పాఠశాల లో
  2. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి తండా లోని మహిళ భవనం మరియు రాయదుర్గం వార్డ్ కార్యాలయంలో
  3. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ లో మరియు సురభి కాలనీ కమ్యూనిటీ హాల్ లో
  4. మాదాపూర్ డివిజన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీలోని కల్చరల్ క్లబ్ , సుభాష్ చంద్రబోస్ నగర్ లోని సెయింట్ ఇసాక్ పాఠశాల,గోకుల్ ప్లాట్స్ కమ్యూనిటీ హాల్ లో
  5. మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కమ్యూనిటీ హాల్, JP నగర్ కమ్యూనిటీ హాల్
  6. హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని మహిళ భవనం హఫీజ్పెట్, గంగారాం కమ్యూనిటీ హాల్
  7. చందానగర్ డివిజన్ పరిధిలోని PJR స్టేడియం, వేమన కాలనీ కమ్యూనిటీ హాల్, దీప్తి శ్రీ నగర్ కమ్యూనిటీ హాల్
  8. భారతి నగర్ డివిజన్ పరిధిలోని MIG లో గల సిర్కి కార్యలయంలో
  9. హైద నగర్ డివిజన్ పరిధిలోని HMT హిల్స్ కమ్యూనిటీ హాల్
  10. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని PJR నగర్ కమ్యూనిటీ హాల్,
  11. వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ కాలనీ లో
  12. కూకట్పల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్ లోగల మెడల్ మార్కెట్ లో కంటి వెలుగు శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఆఫీసర్లు మాన్వి ,ఉష రాణి, డాక్టర్ తీర్థ సాయి ,డాక్టర్ అరవింద్, AMOH కార్తిక్, AMOH మమత గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, ఆయా డివిజన్ల బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, మరబోయిన రాజు యాదవ్, సమ్మారెడ్డి ,గౌతమ్ గౌడ్, లక్ష్మీనారాయణ, అధ్యక్షులు వాలా హరీష్ రావు గంగాధర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సత్యనారాయణ పోతుల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page