జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హంస రాజ్ కి వై.శ్రీధర్ సన్మానం.

Spread the love


Y. Sridhar honor to Hamsa Raj, Chairman of the National BC Commission.

సాక్షిత : రంగరెడ్డి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి వై.శ్రీధర్ జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ గా నియమితులైన హంసరాజ్ గంగారాం అహిర్ కి ఢిల్లీ లోని జాతీయ బీసీ కమిషన్ కార్యాలయం లో రాజ్యసభ మెంబర్ డాక్టర్ కోవ లక్ష్మణ్ తో కలిసి (హాంసరాజ్ గంగారాం ఆహిర్) కి శుభాకాంక్షలు తెలిపి సన్మానించడం జరిగింది.

అనంతరం వై.శ్రీధర్ మాట్లాడుతూ జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చట్టం 1993 ప్రకారం 1993 ఆగస్టు14న ఏర్పడింది. 1953లో జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వం కాకాసాహెబ్ కాలేల్కర్ అధ్యక్షతన మొదటి బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.ఇది 1955లో నివేదిక సమర్పించింది. 1978లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై సిఫారసులు చేసేందుకు బి.పి. మండల్ అధ్యక్షతన కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

ఈ కమిషన్ 1980లో నివేదిక సమర్పించింది. ఈ కమిషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలకు 27% రిజర్వేషన్లు కల్పించాలని సిఫారసు చేసింది. 1979లో జనతాప్రభుత్వం అధికారాన్ని కోల్పోవడంతో మండల్ కమిషన్ సిఫారసులు అమలుకాలేదు. 1990లో వి.పి. సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ సిఫారసులను అమలుచేసింది.

సుప్రీంకోర్టు తీర్పు మేరకు 1993లో పార్లమెంట్ చట్టం ద్వారా శాశ్వత బీసీ కమిషన్‌ను 1993 ఆగస్టు14న ఏర్పాటు చేశారు. దేశంలో 2399 వెనుకబడిన కులాల ఉన్నాయి. దేశం లో 75 శాతం పైగా ఉన్న బీసీ లకు తగిన న్యాయం జరగలేదు జనతా పార్టీ అధికారం కోల్పోవడం తో బీసీ ల సమస్య అటుకెక్కింది,

ఇప్పుడు మోడీ కార్యకాలం లో బీసీ లకు తగు గుర్తింపు వస్తుందని వారి పట్ల మోడీ ప్రభుత్వం దృఢ సంకల్పం తో పనిచేస్తుందని హంసరాజ్ అహీర్ చాలా అపారమైన అనుభవజ్ఞులు వారి నేతృత్వం లో బీసీ లకు కచ్చితంగా తగు న్యాయం జరుగుతుంది అని అన్నారు.

Related Posts

You cannot copy content of this page