ధాన్యం కొనుగోలులో ఎక్కడ ఇబ్బంది రానివ్వం..

Spread the love

No problem in buying grain.

ధాన్యం కొనుగోలులో ఎక్కడ ఇబ్బంది రానివ్వం..


జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి.

జిల్లా వ్యాప్తంగా 2.89 లక్షల ఎకరాల్లో సాగు, 220 కేంద్రాలు, 6.66 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా.

పైనంపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించిన మంత్రి పువ్వాడ.

పాల్గొన్న ఎంపీలు నామా, వద్దిరాజు, పార్థసారథి, ఎమ్మెల్సీ తాతా, కలెక్టర్.

సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి అవసరాలను గుర్తించి వారు అభివృద్ధి చెందాలన్నదే సీఎం కేసీఆర్‌ గారి లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. పాలేరు నియోజకవర్గం పైనంపల్లిలో ఎర్పాటు చేసిన వ‌రి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మేల్యే కందాల ఉపేందర్ రెడ్డి, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, నామా నాగేశ్వరరావు, బండి పార్థసారథి రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి మంత్రి పువ్వాడ లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సంద‌ర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.

.
దేశంలో సుస్థిరమైన వ్యవసాయం, సుస్థిరమైన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని అందుకు ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాల ఫలితంగానే ఇది సాధ్యమైందన్నారు.
ఖమ్మం జిల్లాలో అత్యధికంగా పాలేరు, వైరా, మధిర సత్తుపల్లి నియోజకవర్గాల్లో ఎన్ఎస్పి ఆయకట్టు కింద అత్యధికంగా వరి పండించడం జరుగుతుందన్నారు.


ఖమ్మం జిల్లాలో అత్యధికంగా వారి సాగు అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అందుకు తగ్గ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఏక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతున్నలకు అన్ని వసతులు, సౌకర్యాలు కల్పించడం జరిగిందని, గన్ని బ్యాగ్స్, రవాణా ఇతరత్ర సౌకర్యాలు అందుబాటులో ఉంచామన్నారు. గడచిన రెండేళ్లుగా కోవిడ్ కారణంగా రైతుల నుండి ఆఖరి గింజ వరకు కొని వారి వారి బ్యాంక్ అకౌంట్ లలో నగదును జమచేసి వారిని అదుకున్నామని వివరించారు.


ఉమ్మడి రాష్ట్రంలో 40 లక్షల మెట్రిక్ టన్నులు పండించడం గగనం.. అలాంటిది ఇపుడు 1.40 కోట్ల మెట్రిక్ టన్నుల దిగుబడి సాధించే స్థాయికి చేరామని, అందుకు ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాలే కారణమన్నారు.
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్‌ రైతుల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు.

రైతులకు కోసం ఏర్పాటు చేసిన ఈ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గత ప్రభుత్వాల హయాంలో రైతులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతులను అన్ని విధాల ఆదుకుంటున్నారని తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధర, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడంతో పాటు రైతులకు అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం కల్పిస్తోందని వివరించారు.


జిల్లాలో గ‌తంలో కంటే వ‌రి సాగు విస్తీర్ణం చాలా పెరిగింద‌న్నారు. ఈ సీజ‌న్ లో 2.89 లక్ష‌ల ఎక‌రాల్లో వ‌రి సాగు చేశార‌ని, 6.66 ల‌క్షల మెట్రిక్ టన్నుల దిగుబ‌డి వ‌స్తుంద‌ని వ్యవసాయ శాఖ అధికారులు అంచ‌నా వేశార‌ని ఆయా కొనుగోలు కోసం జిల్లా వ్యాప్తంగా మొత్తం 220 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, అవసరం మేరకు మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

Related Posts

You cannot copy content of this page