కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారంలో రూ.7 కోట్ల వ్యయంతో చేపడుతున్న క్రీడా సముదాయంను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ మేరకు ఇండోర్ క్రికెట్, ఫుట్ బాల్ కోర్టులు, 5 షటిల్ కోర్టులు, బాస్కెట్ బాల్ కోర్టు, రన్నింగ్ ట్రాక్ పనులు 70% పూర్తి కావడంతో మిగిలి ఉన్న పనులు రెండు నెలల్లో వేగంగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. అదే విధంగా అదనంగా పిల్లల్లకు స్కేటింగ్, టేబుల్ టెన్నిస్ వంటివి కూడా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈఈ గోవర్ధన్, డిఈఈ రూపా దేవి, ఏఈ కళ్యాణ్, సీనియర్ నాయకులు రషీద్ బైగ్, కస్తూరి బాల్ రాజ్, పాక్స్ డైరెక్టర్ పరుశ శ్రీనివాస్ యాదవ్, కమలాకర్, తెలంగాణ సాయి, ఇబ్రహీం, మూసాకాన్, సాయిబాబా, లక్ష్మణ్, చిన్న చౌదరి, ఇమ్రాన్ బైగ్, చెట్ల వెంకటేష్, మహేష్, లింగం, అహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు.
రూ.7 కోట్లతో చేపడుతున్న క్రీడా సముదాయంను పరిశీలించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్..
Related Posts
అర్హులైన జర్నలిస్టులు అంటే ఎవరో తేల్చి చెప్పాలి
SAKSHITHA NEWS అర్హులైన జర్నలిస్టులు అంటే ఎవరో తేల్చి చెప్పాలిహైదరాబాదులోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలిముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడిన—రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు…
మల్కాజ్గిరి లో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు…
SAKSHITHA NEWS మల్కాజ్గిరి లో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు… సాక్షిత మల్కాజ్ గిరి : చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి నిర్వహించుకునే పండుగలలో మొదటి పండుగ వినాయక చవితి.. మల్కాజిగిరిలో గల్లి గల్లి లో కొలువైన గణనాథుడు..…