ఘనంగా “అవ్యుక్త” ఇంటర్నేషనల్ స్కూల్ 8వ వార్షికోత్సవం.. పాల్గొన్న రాగం నాగేందర్ యాదవ్

Spread the love

*Ghananga “Avyukta” International School 8th Anniversary.. Ragam Nagender Yadav participated

ఘనంగా “అవ్యుక్త” ఇంటర్నేషనల్ స్కూల్ 8వ వార్షికోత్సవం.. పాల్గొన్న రాగం నాగేందర్ యాదవ్


సాక్షిత : బిహెచ్ఈఎల్ లోగల ఇంటర్నేషనల్ క్లబ్ లో నిర్వహించిన “అవ్యుక్త” ఇంటర్నేషనల్ స్కూల్ 8వ వార్షికోత్సవ వేడుకల్లో శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాని ప్రారంభించారు.

వారితోపాటు శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు వీరేశం గౌడ్, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, చంద్రయ్య తదితరులు హాజరయ్యారు. వార్షికోత్సవానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ, చైర్మన్ కేశవ శ్రీరామ్ అధ్యక్షత వహించగా, ప్రోగ్రాం కోఆర్డినేటర్ గా ఎంఎస్ దినేష్ మరియు అడ్వైజర్ గా ప్రణయ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థానాల్లో ఉండాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు విద్యార్థి దశలోనే ఉత్తమమైన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించడానికి కృషిచేయాలన్నారు. ఈ సందర్బంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ మానేజ్మెంట్ & స్టాఫ్ రితీష, హంసిక, విద్యార్థులు, విద్యార్థుల తల్లితండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page