నా పేరు ఎఫ్ఐఆర్‌లో లేదు.. 6న సీబీఐని కలవలేను: MLC కవిత

Spread the love

My name is not in FIR.. Can’t meet CBI on 6th: MLC Kavitha

నా పేరు ఎఫ్ఐఆర్‌లో లేదు.. 6న సీబీఐని కలవలేను: MLC కవిత

సాక్షిత : ఢిల్లీ లీక్కర్ స్కాం కేసు FIR లో తన పేరు లేదని సీబీఐకి ఎమ్మెల్సీ కవిత మరో లేఖ రాశారు. వెబ్‌సైట్‌లో ఎఫ్ఐఆర్ (FIR), ఫిర్యాదు ఉన్నట్లు సీబీఐ తెలిపిందన్నారు.ఎఫ్ఐఆర్, నిందితుల జాబితా, ఫిర్యాదును పరశీలించానని.. కానీ తన పేరు అందులో ఎక్కడా లేదని.. రికార్డెడ్‌గా చెప్పాలనుకుంటున్నట్టు కవిత పేర్కొన్నారు. ఈ నెల 6న సీబీఐని కలవలేనన్నారు.

ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల.. సీబీఐ అధికారులను కలిసే అవకాశం లేదన్నారు. ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో సీబీఐకి అందుబాటులో ఉంటానని కవిత పేర్కొన్నారు. తనకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందన్నారు. తాను చెప్పిన తేదీల్లో ఎప్పుడైనా సీబీఐ రావొచ్చన్నారు. సీబీఐ విచారణకు పూర్తిగా సహకరిస్తానని లేఖలో కవిత పేర్కొన్నారు.

Related Posts

You cannot copy content of this page