ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా దేశంలో 80 కోట్ల మందికి ఉచిత రేషన్ బియ్యం పంపిణీ

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం బాచుపల్లి మండలం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపుమేరకు, జిల్లా పార్టీ సూచనల అనుసారంమేరకు మహాజన్ సంపత్ క్ అభియాన్ లో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిది సంవత్సరముల సుపరిపాలన గూర్చ డివిజన్ 20 లో శక్తి కేంద్రం ఇంచార్జి మరియు మేడ్చల్ జిల్లా రూరల్ గిరిజన మోర్చా అధ్యక్షులు రామచంద్రనాయక్ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలను గడపగడపకు కరపత్రాలు ప్రజలకు అందియడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి, మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై వారు మాట్లాడుతూ
అంత్యోదయ స్ఫూర్తి
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా దేశంలో 80 కోట్ల మందికి ఉచిత రేషన్ బియ్యం పంపిణీ మూడు కోట్ల పేద కుటుంబాలకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా పక్క ఇండ్లు, ప్రధానమంత్రి సన్నిధి యోజన ద్వారా కరోనా సమయంలో 34 లక్షల మందికి తెలంగాణలో విధి వ్యాపారులకు రుణాల పంపిణీ,
కిసాన్ యోజన ద్వారా 12 కోట్ల మంది రైతులకు ఏడాదికి 60 వేల ఆర్థిక సహాయం. ఫసల్ బీమా యోజన ద్వారా 3 7.5 కోట్ల మంది రైతులకు నమోదు, కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా నాలుగు కోట్ల రైతులకు 4.7 లక్షల కోట్ల కార్డులు అందించడం జరిగింది. ఇలా అన్ని రంగాల్లో కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్ సొమ్ము ఒకరిది సోకు మరొకరిది అంటూ తన సొంత డబ్బా కొట్టుకుంటూ కల్లబొల్లి మాటలతో కాలయాపన చేస్తూ చారన్కోడికి బారిన మసాలా అన్న చందనంగా స్కీం పెట్టి ప్రచారానికి మాత్రం కోట్లాది రూపాయలు ప్రజా సొమ్ము వృధా చేస్తు తెలంగాణలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను మోసం చేయడమే కాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారు అని అన్నారు. తెలంగాణ సర్కార్ కు ప్రజలు ఎవరు నమ్మరలేరు రాష్ట్రంలో వచ్చేది బిజెపి ప్రభుత్వం అని అన్నారు.

రామచంద్రనాయక్ మాట్లాడుతూ అందరికీ ఆరోగ్యకరమైన జీవితం కొరకు కేంద్ర ప్రభుత్వం10.7 కోట్ల కుటుంబాల ఆరోగ్య భీమా కవరేజ్, ఆయుష్మాన్ భారత్ ద్వారా 4.5 కోట్ల ప్రజలకు ఉచిత చికిత్స వైద్యశాలల బలోపేతం కోసం 64,180 కోట్ల రూపాయలు కేటాయింపు ఆయుష్మాన్ భారత్ కింద 1.59 లక్షల పైన ఆరోగ్య కేంద్రాలు ప్రపంచంలోని అత్యంత భారీ టీకా కార్యక్రమం ద్వారా వందలాది కోట్ల రూపాయలు కరోనా సమయంలో దేశంలోనే కాదు ఇతర దేశాలకు కూడా ఉచితంగా టీకాలు అందించిన బిజెపి ప్రభుత్వం అని అన్నారు.
ప్రజల ఓట్ల చేత గెలుపొందిన టిఆర్ఎస్ నాయకులు ప్రజల సమస్యలను గాలికి వదిలేసి కేవలం లాభార్జన కోసం ప్రభుత్వ భూములు, చెరువులు కుంటలు నాళాలు ఎక్కడ పడితే అక్కడ అన్యంగా ఆక్రమించుకుంటున్నారని అన్నారు.
గత 9 ఏళ్ల పాలనలో రేషన్ కార్డు పైన కేంద్ర ప్రధానమంత్రి ఫోటో ఎక్కడ పెట్టవలసి వస్తుంది అని ఏ ఒక్క పేదవాడికి కొత్త రేషన్ ఇవ్వకపోగా ఉన్న రేషన్ కార్డులు తీసివేయడం జరిగింది. అని అన్నారు.

ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ కో కన్వీనర్ డాక్టర్ రాజు, పార్లమెంట్ మీడియా కో కన్వీనర్ సుమన్ రావు, రాష్ట్ర దళిత మోర్చా కన్వీనర్ దాసి నాగరాజు, బిజెపి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి నరేంద్ర చౌదరి, ఉపాధ్యక్షులు కాసాని నరసింహ, దళిత మోర్చా అధ్యక్షులు రాము, లీగల్ సెల్ కో కన్వీనర్ పురుషోత్తం రెడ్డి, 32 వ డివిజన్ శక్తి కేంద్రం ఇంచార్జి P B శ్రీనివాసులు , అధ్యక్షులు ఎల్లా స్వామి, 72వ బూత్ అధ్యక్షులు రామ్ రెడ్డి, 83వ బూత్ యువమోర్చా అనిరుద్ మనేకి బాత్ ప్రముఖ రామ్ లఖన్ రాయ్, 24వ డివిజన్ ప్రధాన కార్యదర్శి అంకం సతీష్ , 151వ బూత్ అధ్యక్షులు చిన్న నరసింహులు యాదేశ్, బిజెపి కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో. పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page