మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్తా మహబూబ్ పెట్ లోని పెద్ద కుడి చెరువు సుందరికరణ

Spread the love

Beautification of Big Right Pond in Makta Mahbub Pet under Miyapur Division

సాక్షిత : మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్తా మహబూబ్ పెట్ లోని పెద్ద కుడి చెరువు సుందరికరణ లో భాగంగా రూ.199 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న అలుగు మరియు కల్వర్టు నిర్మాణం పనులకు కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్త మహబూబ్ పెట్ లో కుడి కుంట చెరువు అభివృద్ధి లో భాగంగా రూ. 199 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న చెరువు యొక్క అలుగు నిర్మాణం,కల్వర్టు నిర్మాణం కొరకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని మరియు సుందరికరణ, సంరక్షణ,అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుంది అని,ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

అదేవిధంగా చెరువు సుందరికరణ లో భాగంగా చెరువు కట్ట పటిష్టం పరిచేలా పునరుద్ధరణ , మురుగు నీరు చెరువు లో కలవకుండా ప్రత్యేకంగా చెరువు చుట్టూ నిర్మించే మురుగు నీటి కాల్వ (UGD) నిర్మాణం మరియు అలుగు మరమ్మత్తులు, చెరువు కట్ట బలోపేతం ,పునరుద్దరణ పనులు, వాకింగ్ ట్రాక్ వంటి పనులు చేపడుతామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు

చెరువు సంరక్షణ లో భాగంగా చెరువు చుట్టూ ఫెన్సిగ్ (కంచె) నిర్మాణం మరియు చెరువు యొక్క అలుగు నిర్మాణము మరియు చెరువు సుందరికరణ పనులు చేపడుతున్నాం అని ,చెరువు సుందరికరణ మరియు అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని అధికారులకు తెలియచేశారు అదేవిధంగా ప్రణాళిక తో పనులు చేపట్టాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు .

అదేవిధంగా చెరువులను సంరక్షణిచడమే ధ్యేయంగా పనిచేస్తున్నాం అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా మెడికుంట చెరువును సుందరవనం గా ,శోభితవర్ణం గా తీర్చిదిద్దుతామని, అదేవిదంగా చెరువు ల చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి చెరువు ల ను సంరక్షిస్తామని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు .

చెరువు ల వాకింగ్ ట్రాక్ నిర్మాణం గూర్చి అధికారులకు పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగినది .త్వరిత గతిన వాకింగ్ ట్రాక్ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు . చెరువు అపరిశుభ్రం వలన పేరుకుపోయిన గుర్రపు డెక్క వలన దోమల పెరగడం వలన స్థానికులకు ఏర్పడుతున్న ఇబ్బందులను ,అనారోగ్యాలకు గురవడం స్థానికులు పలుమార్లు ఎమ్మెల్యే గారికి పిర్యాదు చేయడం వలన దీనికి స్పందించిన ఎమ్మెల్యే స్థానికులు పడుతున్న ఇబ్బందులను తొలగించడానికి చెరువును దత్తత తీసుకొని సొంత నిధులతో చెరువును శుభ్రపరిచి సుందరీకరణ చేసిన సంగతి విదితమే

.అదేవిధంగా ప్రజలకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తామని చెప్పడం జరిగినది , తామర పువ్వులను పెంచి కలుషితం కాకుండా చెరువును సుందరీకరిస్తామని ఎమ్మెల్యే గాంధీ చెప్పటం జరిగినది .చెరువులను సుందరీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ,చెరువులు కలుషితం కాకుండా మరియు కబ్జాలకు గురికాకుండా చెరువులను పూర్తి స్థాయి లోసంరక్షిస్తామని ,

చెరువు చుట్టూ పెన్సింగ్ ఏర్పాటు చేసి వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేసి ,ప్రజలకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తామని,అలాగే నియోజకవర్గం లోని అన్ని చెరువులను పూర్తి స్థాయిలో సుందరీకరిస్తామని ఎమ్మెల్యే చెప్పటం జరిగినది చెరువుల పరిరక్షణకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని ,మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరిస్తామని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగింది .

ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు DE నళిని ,AE నాగరాజు మరియు ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ పార్టీ నాయకులు పురుషోత్తం యాదవ్, గంగాధర్, BSN కిరణ్ యాదవ్, మోహన్ ముదిరాజు,మాధవర గోపాల్ రావు, శ్రీనివాస్ గోపారాజు, రఘునాథ్, వెంకటేశ్వర్లు, కాజా,రాజేష్ గౌడ్, నర్సింగ రావు, మల్లేష్, స్వామి నాయక్,శ్రీకాంత్ , అమరేందర్ రెడ్డి , ఎజాజ్, సుధాకర్, చందు, శ్రీకాంత్ రెడ్డి, కృష్ణ ,తిరుపతి ,రోజా, వరలక్షి ,సుప్రజ, తదితరులు పాల్గొన్నారు..

Related Posts

You cannot copy content of this page