బి సి వై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ చేతుల మీదుగా బి ఫామ్

Spread the love

బి సి వై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ చేతుల మీదుగా బి ఫామ్ తీసుకుంటున్న ఓరుగంటి వెంకటేశ్వర్లు

మేడ్చల్ లో బి సి వై పార్టీ గెలుపు ఖాయం… బి సి వై పార్టీ జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్

మేడ్చల్ లో బి సి వై పార్టీ పేరు వింటేనే ప్రత్యర్థులకు ఓటమి భయం కలుగుతుంది…ఓరుగంటి వెంకటేశ్వర్లు మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి

బి సి వై పార్టీ జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గారి చేతుల మీదుగా మేడ్చల్ నియోజకవర్గం బి సి వై పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఓరుగంటి వెంకటేశ్వర్లు బీ ఫామ్ తీసుకున్నారు.ఈ సందర్బంగా బి సి వై పార్టీ జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ…మేడ్చల్ నియోజకవర్గంలో బీసివై పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఓరుగంటి వెంకటేశ్వర్లు యాదవ్ గెలుపు ఖాయమన్నారు.మేడ్చల్ నియోజకవర్గాన్ని ఐటీ హబ్ గా తీర్చిదిద్దాలని నిరంతరం పోరాటం చేస్తున్న ఓరుగంటి వెంకటేశ్వర్లు కు ఐటీ ఉదోగ్యులు,నీరుదోగ్యులు,రైతాంగం,బీసీ, ఎస్సీ,ఎస్టీ మైనార్టీ,మేడ్చల్ నియోజకవర్గం ప్రజలందరూ చెరకు రైతు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు.మేడ్చల్ నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి జరగాలంటే విద్యావంతుడు,యువ నాయకుడు, ఉత్సాహవంతుడైన ఓరుగంటి వెంకటేశ్వర్లు సాధ్యమన్నారు.ఓరుగంటి వెంకటేశ్వర్లు తోనే మేడ్చల్ నియోజకవర్గంలో నూతన ఒరవడి వస్తుందన్నారు.అనంతరం బి సి వై పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఓరుగంటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ…మేడ్చల్ నియోజకవర్గం లో బీసివై పార్టీ పేరు వింటేనే ప్రత్యర్థులకు ఓటమి భయం కలుగుతుందన్నారు.మేడ్చల్ నియోజకవర్గం ఓటర్లు బీసీవై పార్టీకి పట్టం కడుతున్నారన్నారు.మేడ్చల్ నియోజకవర్గంలో బి సి వై పార్టీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Whatsapp Image 2023 11 06 At 20.54.47

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page