డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పంపిణీ అవగాహన సదస్సు*

Spread the love

Awareness Conference on Distribution of Double Bedroom Houses

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పంపిణీ అవగాహన సదస్సు

పాల్గొన్న ఎమ్మెల్యే అంజయ్య యాదవ్


రంగారెడ్డి జిల్లా సాక్షిత ప్రతినిధి


డబుల్ బెడ్ రూమ్ పథకంలో నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఇండ్లు అందాలని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీ లో గల గణేష్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో డబుల్ బెడ్ రూమ్ లబ్దిదారుల అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.

ఇందులో ముఖ్య అతిధి గా స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అధికారులు ప్రజాప్రతినిధులు తమ పరిధిలో కొంత పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముఖ్యంగా రోడ్డుపై ఫుట్ పాత్ బతుకులు బతుకుతూ ఏళ్ల తరబడి అద్దె ఇంటిలో ఉంటూ ఇల్లు లేని నిరుపేదలకు ఈ పథకం అందితే ఎంతో మంచిదని అన్నారు.

నిజమైన అర్హులకు మాత్రమే డబల్ బెడ్ రూమ్ దక్కాలి అన్నది ప్రభుత్వ ఆశయం. నిజమైన లబ్ధిదారులు ముందుకు వస్తేనే గ్రామ సభల ద్వారా వారిని ఎంపిక చేస్తే బాగుంటుందని ఏలాంటి ఆస్తి పాస్తులు, ఇల్లు లేని వారిని పూర్తిస్థాయిలో గుర్తించి మాత్రమే ఇవి పంపిణీ చేస్తే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది అని అన్నారు.

ఈ నేల 15 వ తేది వరకు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఎవ్వరికి ఎలాంటి లంచం కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దని ఆలా ఎవరైనా ఇచ్చినట్టు తెలిసిన వారికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు దక్కదని అలాగే ఎవరైనా అధికారులు లంచం తీసుకున్నట్టు తెలిస్తే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.

నిరుపేదలకు మాత్రమే ఎంపిక చేయాలనీ అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమం లో RDO రాజేశ్వరి, MRO గోపాల్, మున్సిపల్ కమీషనర్ వెంకన్న, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజ్, మున్సిపల్ కౌన్సెలర్లు, కో ఆప్షన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page