చరిత్రలో నిలిచిపోయే పథకం “కంటి వెలుగు”: వికారాబాద్ ఎమ్మెల్యే

Spread the love

A scheme that will go down in history “Light of the eye”: Vikarabad MLA

చరిత్రలో నిలిచిపోయే పథకం “కంటి వెలుగు”: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”


సాక్షిత : * వికారాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే *”డాక్టర్ మెతుకు ఆనంద్” వికారాబాద్ పట్టణంలోని 31వ వార్డు శివరాంనగర్ లో మరియు ధారూర్ మండల కేంద్రంలో కంటి వెలుగు పథకం రెండవ విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ప్రజలు ఎలాంటి అపోహాలు లేకుండా కంటి వెలుగు పథకం సేవలను వినియోగించుకోవాలని, పరీక్షలు నిర్వహించిన తర్వాత వారి వారి ఆధార్ కార్డు లింక్ తో ఎవరి కళ్లద్దాలు వారికే బార్ కోడ్ తో అందించబడతాయన్నారు.

ప్రతి క్యాంపు దగ్గర ఉదయం 9:00 AM గంటల నుండి సాయంత్రం 4:00 PM గంటల వరకు సేవలు అందించబడతాయన్నారు.

ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అధిక సంఖ్యలో ప్రభుత్వం ప్రజలకు నాణ్యత ప్రమాణాలతో కూడిన కంటి పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలు అందించడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ , ప్రజా ప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page