జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తా – మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

Spread the love


Will work for the welfare of journalists – Former MLA Koona Srisailam Goud

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తా – మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం (TUWJ – 143), TEMJU ఎన్నికైన సందర్బంగా కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ని షాపూర్ నగర్ లోని ఆయన నివాసం వద్ద మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

బీజేపీ అధికారంలోకి రాగానే జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ (TUWJ – 143) అధ్యక్షులు సుదీర్ మాంకాల, ప్రధాన కార్యదర్శి కృష్ణా రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రంగు వెంకటేష్ గౌడ్, శివాజి, కోశాధికారి సురేందర్, ఉపాధ్యక్షులు మాధవ రెడ్డి, సెక్రెటరీలు రాజు గౌడ్, నరేందర్, కార్యవర్గ సభ్యులు ప్రవీణ్, ఎలక్ట్రానిక్ మీడియా (TEMJU) అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ ప్రవీన్, కోశాధికారి శివ తదితర జర్నలిస్టు సోదరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page