కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ కేటాయింలులో నిరుద్యోగ సమస్య పరిష్కరానికి చిత్తశుద్ధి ఏది.

Spread the love

What is the sincerity in central and state budget allocations to solve the problem of unemployment?

కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ కేటాయింలులో నిరుద్యోగ సమస్య పరిష్కరానికి చిత్తశుద్ధి ఏది.

రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులో నిరుద్యోగ భృతి అమలుకు ఊసేలేదు.

డి.వై.యఫ్.ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల.రమేష్.

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులో నిరుద్యోగ సమస్య పరిష్కరానికి చిత్తశుద్ధి ఏకడ ఉందని,రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులో నిరుద్యోగ భృతి అమలుకు అసలు ఊసేలేదు అన్ని,క్రీడా రంగానికి నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేశారని డి.వై.యఫ్.ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల.రమేష్ అన్నారు.


బడ్జెట్ కేటాయింపులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం చేయడాని నిరసిస్తూ డి.వై.యఫ్.ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, బడ్జెట్ ప్రతుల దహన కార్యక్రమంలో భాగంగా స్థానిక పాటిమీద గుంపు గ్రామంలో డి.వై.యఫ్.ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో బడ్జెట్ ప్రతుల దహనం చేసి అనంతరం జరిగిన డి.వై.యఫ్.ఐ మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మోడీ, బీజేపీ అధికారంలోకి వచ్చాక ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను ఇస్తానని హామీ ఇచ్చారని, కానీ కేంద్ర బడ్జెట్ లో కేటాయించలేదని ఆయన తెలిపారు.

అలాగే రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులో కేవలం ఎనభై వేల ఉద్యోగాలకు మాత్రమే నిధులు కేటాయించారని,మిగిలిపోయిన ఖాళీల భర్తీకి నిధులు కేటాయించలేదని ఆయన ఆరోపించారు.రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతిని రూ,3016 లు ఇస్తామని హామీ ఇచ్చి,కనీసం బడ్జెట్ కేటాయింపులో అసలు ఆ ఊసే లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో క్రీడా రంగానికి అధిక నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేశారని ఆయన అన్నారు.

మొత్తానికి కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ కేటాయింలులో నిరుద్యోగ సమస్య పరిష్కరానికి చిత్తశుద్ధిని ప్రదర్శించలేదని,నిరుద్యోగ యువత పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డి.వై.యఫ్.ఐ జిల్లా నాయకులు ధరవత్.వినోద్, డి.వై.యఫ్.ఐ మండల కార్యదర్శి ధరవత్. రవి కుమార్,మండల నాయకులు ధరవత్.సంతోష్, బాణోత్.బావుసింగ్, ధరవత్. వీరన్న తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page