కార్పొరేషన్ పరిధిలో కురుమ యాదవులకు గొర్రెలకు బదులు పాడి గేదెలు ఇస్తామన్న ప్రభుత్వ హామీ ఏమైంది

Spread the love

కార్పొరేషన్ పరిధిలో కురుమ యాదవులకు గొర్రెలకు బదులు పాడి గేదెలు ఇస్తామన్న ప్రభుత్వ హామీ ఏమైంది?

-మేకల మల్లి బాబు యాదవ్

సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్;

ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందని, గొర్రెల పెంట వల్ల రోడ్లు పాడవుతాయని, గొర్రెలకు ప్రత్యామ్నాయంగా కార్పొరేషన్ పరిధిలోని కురుమ యాదవులకు పాడి గేదెలు మంజూరు చేస్తామని గతంలోహామీ ఇచ్చిన ప్రభుత్వం., ఈరోజు వాటి విషయంలో ఎక్కడా ప్రస్తావించకపోవడం దుర్మార్గమని, పట్టణ ప్రాంతాల్లోని కురుమ యాదవులకు తీరని అన్యాయం జరుగిందని, కార్పొరేషన్ పరిధిలోని వారికి వెంటనే పాడి గేదెలు మంజూరు చేయాలని డిసిసిబి డైరెక్టర్, అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఈరోజు అఖిల భారత యాదవ మహాసభ జిల్లా కార్యాలయం ఖమ్మం లో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో మల్లి బాబు యాదవ్ మాట్లాడుతూ కార్పొరేషన్ మరియు పరిధిలోని విలీన గ్రామాలలోని కురుమ యాదవులకు ప్రభుత్వం గతంలో పాడిగేదెలు ఇస్తామని హామీ ఇచ్చిందని, కురుమ యాదవులు ముఖ్యమంత్రికి పాలాభిషేకం కూడా చేశామని,ముఖ్యంగా ప్రగల్బాలు పలికిన కొందరు నాయకులు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారని, ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏమైంది అని మల్లి బాబు యాదవ్ సూటిగా ప్రశ్నించారు. ఖమ్మం నగరంలో దాదాపు 15 వేలకు పైగా కురుమ యాదవ కుటుంబాలు నివసిస్తున్నాయని, విలీన గ్రామాలైన అల్లిపురం కొత్తగూడెం,గొల్లగూడెం , బల్లేపల్లి, దానవాయిగూడెం రామన్నపేట కైకొండాయిగూడెం, ఖానాపురం, టేకులపల్లి ,తదితర గ్రామాల వారికి గొర్రెల పథకం మంజూరు కాక, పాడి గేదెలు మంజూరు గాక నిస్సహాయ స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వం వెంటనే కురుమ యాదవులకు పాడి గేదెలు మంజూరు చేయాలని, గొర్రెల పంపిణీ పథకం లబ్ధిదారులకునాసిరకం గొర్రెలకు బదులుగా నగదు బదిలీ చేయాలని, 18 సంవత్సరము నిండిన ప్రతి కురుమ యాదవులకి గొర్రెలు మంజూరు చేయాలని, కార్పొరేషన్ పరిధిలో వలస వచ్చి పనులు చేసుకుంటున్న నిరుపేద కురుమ యాదవులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళిత బంధులాగ కురుమ యాదవులకు 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించాలని, స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని వారికి మూడు లక్షల రూపాయల పథకం అమలు చేయాలని ప్రమాదవశాత్తు మరణించిన గొర్రెల కాపరికి 10 లక్షల రూపాయలు ఎక్స గ్రేషయా ఇవ్వాలని, ప్రతి గొర్రెకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, మల్లి బాబు యాదవ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం జిల్లా నాయకులు లిక్కి కృష్ణారావు, బండారు ప్రభాకర్, సత్తి వెంకన్న, యాదాల నాగేశ్వరరావు, కాసు మల్లేష్, బత్తుల నాగేశ్వరరావు, మేడుదుల మల్లేష్,కన్నబోయిన రవి,, దుద్దుకూరి చందర్రావు, నూకల వెంకన్న, శ్రీనివాసరావు మేకల మహేష్, రవి తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page