రాష్ట్రపతికి ‘దండార్‌’తో స్వాగతం

Spread the love

Welcome the President with ‘Dandar’

రాష్ట్రపతికి ‘దండార్‌’తో స్వాగతం

తొలిసారిగా గిరిజనులతో..

హైదరాబార్‌: ఈ నెల 26న నగరానికి రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గిరిజనుల్లోని కోలాం తెగ తమ ‘దండార్‌’ నృత్యంతో స్వాగతం పలకనుంది.27న రాష్ట్రపతి నిలయమైన బొల్లారంలో స్వాగత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు పది మందితో కూడిన బృందాన్ని గిరిజన సంక్షేమ శాఖ సిద్ధం చేసింది.

అనంతరం కొంత మంది గిరిజనులతో రాష్ట్రపతి ముఖాముఖి భేటీ కానున్నారు. 28న రామప్ప, భద్రాచలం ప్రాంతాల పర్యటనల సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని గిరిజనులతోనూ రాష్ట్రపతి ముచ్చటించనున్నారు.

రాష్ట్రానికి వస్తున్న రాష్ట్రపతికి స్వాగతం పలుకుతూ గిరిజన తెగల నృత్యాన్ని ప్రదర్శించడం ఇదే మొదటిసారి. గిరిజనులతోనూ రాష్ట్రపతి భేటీ కావడం ఇదే మొదటిసారి. అయితే గిరిజనులతో భేటీ సమాచారం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Related Posts

You cannot copy content of this page