తాండూర్ నియోజకవర్గం లో మాదిగల, SC వర్గీకరణ కొరకు హైదరాబాద్ లో జరుపబోయేవిశ్వరూప మహాసభను..

Spread the love

తాండూర్ నియోజకవర్గం లో మాదిగల, SC వర్గీకరణ కొరకు హైదరాబాద్ లో జరుపబోయే
విశ్వరూప మహాసభను..
విజయవంతం చేయుటకు సన్నాహక సధస్సు జరిగింది.

సాక్షిత వికారాబాద్ జిల్లా తాండూర్ : నియోజకవర్గం, తాండూర్ పట్టణం లో,సాయిపూర్ తులసి గార్డెన్ లో MRPS మరియు MSP సంయుక్తముగా హైదరాబాద్ లో నిర్వహించ బోయే,విశ్వరూప మహాసభను విజయముగా జరుపుటకొరకు, తాండూర్ పట్టణం సాయిపుర్ తులసిగార్డెన్ లో సన్నాహక సధస్సు నిర్వహించారు. ఇట్టి సభ అధ్యక్షులు గా మల్లిఖార్జున్ మాదిగా జిల్లా కన్వీనర్ ఉన్నారు.

ముఖ్య వక్తగా మంద కృష్ణ మాదిగా MRPS &MSP అధ్యక్షులు గా పాల్గొన్నారు. ఈసందర్బంగా వారు మాట్లాతు గత 29 సంవత్సరాలనుండి MRPS పోరాటం చేయుచున్నది,ఇప్పటి వరకు 29 సంవత్సరాలనుండి అలుపెరుగని పోరాటం చేయటం జరిగిందన్నారు, Sc వర్గీకరణ కొరకు గతంలో upa ప్రభుత్వం చేస్తాం అని 10 సంవత్సరాలు కేంద్రం లో ఉండి చేయలేక పోయిందన్నారు. అలాగే బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ 9 సంవత్సరాలనుండి చేయలేదు, కానీ ఇపుడు చేస్తా మనిమొన్న మాట ఇచ్చారు ప్రధాన మంత్రిగారు,చూడాలి అన్నారు, ఇక BRS కెసిఆర్ సీఎం ముందు అసెంబ్లీ లో బిల్లు పెట్టి పాస్ చేస్తాం కేంద్రనికి పంపుతామన్నారు,ఇంతవరకు sc వర్గీకరణ కొరకు ఏమిచేయలేదు, ఎందుకు చేయడం లేదని అడిగితే, జైలులో వేయించినాడు, అపుడు చేస్తామన్నందుకే అడుగుతున్నారు కదా, అని జర్నలిస్ట్ లు అడిగితే, అవును అంటాము ఐతే ఎందుకు చేయలేరు అని నన్ను ఆడుతారా అంటున్నాడు, కనుక మాదిగలను మోసం చేస్తున్న BRS లో తిరిగిన,మద్దతు ఇచ్చిన మనలని మనమే మోసం చేసుకున్నంత పని అవుతుంది,

కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ గెలిచిన కూడ చేయరు,రేవంతరెడ్డి ఎన్నికల లో sc వర్గీకరణ గురించి పోరాడుదాం అన్నారు, మద్దతు ఇచ్చాం MP గా గెలిచాడు కానీ 5 సంవత్సరాలనుండి MP గా 5 నిముషాలు sc వర్గీకరణ గురించి మాట్లాడలేదు, కాభట్టి ఈ రెండు పార్టీలను నమ్మవద్దు, మన శక్తి,సమయం శ్రమ,ఇచ్చి మనం గెలిపిస్తే మనలను మోసం చేస్తున్నాయి BRS, కాంంగ్రెస్, రేపు జరుగ బోయే విశ్వరూపమహా సభ కొరకు శక్తి, సమయం, శ్రమ, కేటాయించి మీరందరు మాదిగా జాతి బిడ్డలు జీవితాలు భాగుపడాలంటే ఇళ్లకు తాలాలు వేసి అందరూ రండి, అనిపిలుపు నిచ్చారు.

CITU ఆధ్వర్యంలో గ్రాపంచాయతీ కార్మికులు, రాష్ట్ర ప్రభుత్వం, పర్మినెంట్ ఉద్యగులుగా చేయాలనీ గత నెల రోజులుగా కావస్తున్న ఇంతవరకు ప్రభుత్వంచర్చించడం లేదని కార్మికులు అందరూ క్రిష్ణ మాదిగను కలసి వినతి పత్రం ఇచ్చారు, సిపిఎం, సిపిఐ,ఆధ్వర్యంలో అఖిల పక్ష రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసిపంచాయతీ మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ ఉద్యగులుగా చేయుటకు, MRPS పూర్తి మద్దతు ఉంటుంది, కెసిఆర్ చేయకుంటే ఆయన జేజేమ్మ చేస్తుందని హామీ ఇచ్చారు. ఇట్టి కార్యక్రమం లో బసంతన్న మాదిగ మర్పల్లి. బలరాం మాదిగ. మల్లేష్ మాదిగ, సువర్ణ మాదిగ, నర్సిములు మాదిగ మాజీ సర్పంచ్ భర్త. డక్కాలి యాదయ్య వడిచర్ల. రత్నం మాదిగ, prakash మాదిగ, సుదర్శన్ మాదిగ, కోళ్ల శివప్ప మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page