శ్రీ రామనవమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్ & కార్పొరేటర్లు & గ్రామ పెద్దలు

Spread the love

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిజాంపేట్ టెంపుల్ బస్ స్టాప్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ చైర్మన్, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ మరియు కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద , డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , కోలన్ లీడర్ నర్సింహా రెడ్డి, కోలన్ చంద్ర శేఖర్ రెడ్డి, కుటుంబ సమేతంగా,శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ వైస్ ఛైర్మెన్ రాజ్ మోహన్ రెడ్డి, శ్రీ సీతారాముల స్వామి వారి కల్యాణ మహోత్సవ వేడుకల్లో ఆశీనులై స్వామి వారికీ అమ్మవారికి పట్టు వస్త్రాలు మరియు తలంబ్రాలు అందించి ప్రత్యేక పూజలు పాల్గొని కళ్యాణ మహోత్సవం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం ఎన్నో కష్టాలు త్యాగాలు కోర్చిన శ్రీ సీతారాముల పవిత్ర బంధం ఆజరామరమైనదని, సత్య ధర్మ పాలనకు, నేటి భావి తరాలకు ఆదర్శనీయుడని, శ్రీ సీతారాముల ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవనం సాగించేలా దీవించాలని సీతారామచంద్రమూర్తులను వేడుకున్నానని తెలిపారు.నిజాంపేట్ కార్పొరేషన్ ప్రజలకు శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రణయ ధనరాజ్ యాదవ్ , మేకల వెంకటేష్, కో ఆప్షన్ సభ్యలు తల్లారి వీరేష్, గ్రామ పెద్దలు లీడర్ నర్సింహా రెడ్డి దంపతులు, ప్రమీల సాయిలు యాదవ్ & కోలన్ చంద్ర శేఖర్ రెడ్డి దంపతులు,కోలన్ గోపాల్ రెడ్డి,సరెందర్ రెడ్డి, రుక్కా రెడ్డి, నగేష్ చారీ, సీనియర్ నాయకులు కోలన్ శేఖర్ రెడ్డి,ఆవుల జగన్ యాదవ్ , బొర్రా చందు, శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యులు బైండ్ల నగేష్, నాగరాజ్ యాదవ్, టేకుల సుధాకర్ రెడ్డి, కోలన్ లక్ష్మణ్ రెడ్డి, ప్రవీణ్, తల్లారి సాయి, ఆలయ ధర్మకర్తలు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, మరియు భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page