పది లో ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు శుభాభినందనలు – జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్.

Spread the love

సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: జిల్లాలో పదో తరగతి పరీక్షలలో ప్రభుత్వ పాఠశాలలో విజయ పరంపర కొనసాగించారని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అన్నారు. జిల్లాలో అన్ని పాఠశాలలు, వసతి గృహాల్లో ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మెరుగైన వసతులు కల్పించామని, విద్యార్థులకు నాణ్యమైన విద్యానందించామని ఆదిశగా జిల్లా విద్యాశాఖ అధికారి, మండల విద్యా శాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయిలు, తహశీల్దార్లు, ఎంపీడీఓ లు, మున్సిపల్ కమిషనర్లు, మండల టీమ్స్ లకు పది పలితాలకై తమ వంతు కృషి చేసారని రాష్ట్రంలో 96.91 శాతంతో రాష్ట్రంలో 6వ ర్యాంక్ సాధించామని ఈ సందర్బంగా హృదయ పూర్వకంగా అభినందించారు. జిల్లాలో 11910 మంది విద్యార్థులకు గాను 11542 మంది ఉత్తీర్ణులు అయ్యారనిఅలాగే 354 మందికి 10 /10 జి.పి.ఏ వచ్చాయని అన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులు అధైర్య పడకుండా సప్లమెంటరీ పరీక్షలు రాసి ఉత్తీర్ణత పొందాలని ఓటమి తొలి విజయానికి నాంది అని తెలిపారు. జిల్లాలో మైనార్టీ అలాగే రెసిడెన్షియల్ పాఠశాలలో నూటికి నూరుశాతం ఉత్తీర్ణత పొందారని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంక్ రావడంతో రాష్ట్ర స్థాయి విద్యా శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ కి ఈ సందర్బంగా అభినందనలు తెలిపారు. సూర్యాపేట జిల్లాలో రాష్ట్రస్థాయిలో నిలిపినందుకు జిల్లా విద్యాధికారి అశోక్ కుమార్ ను ప్రధానోపాధ్యాయులను కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ 10/10 తెచ్చుకున్న గండూరి జానకమ్మ మెమోరియల్ విద్యార్థిని కే హారికను కలెక్టర్ తన క్యాంపు కార్యాలయం నందు ఉపాధ్యాయులతో పాటుగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో డీఈవో అశోక్ కుమార్ డిటిడిఓ శంకర్ గండూరి జానకమ్మ మెమోరియల్ స్కూల్ హెచ్ఎం రమణారెడ్డి విద్యార్థిని తండ్రి కె శ్రీనివాస్ ప్రధానోపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page