అత్యంత పారదర్శకంగా కొనసాగుతున్న
దేహధారుడ్య పరీక్షలు.

Spread the love

The most transparent ongoing Physical examination

ఎలాంటి అవినీతి ఆరోపణలకు ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా కొనసాగుతున్న
దేహధారుడ్య పరీక్షలు.


17వ రోజు హజరైన 1064 మంది అభ్యర్థులు…

తుది పరిక్షలకు అర్హత సాధించిన 633 మంది అభ్యర్థులు..

మరో ఐదు రోజుల్లో పూర్తి కానున్న దేహధారుడ్య పరిక్షలు..

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో స్ట్ఫైండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్స్, కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఈరోజు జరిగిన దేహదారుఢ్య పరీక్షలకు 1064 మంది హజరైయ్యారని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు. ఇందులో 633 మంది అభ్యర్థులు తుది పరిక్షలకు అర్హత సాధించారని తెలిపారు. ఈరోజు మొత్తం 1235 మంది అభ్యర్థులు హజరు కావాల్సివుండగా 1064 మంది హజరై ఈవెంట్లలో పాల్గొన్నారని తెలిపారు. ఎలాంటి అవినీతి ఆరోపణలకు ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా..జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో పోలీస్ నియామకాలకు సంబంధించి


ఈవెంట్స్ ను నిర్వహిస్తున్నామని పోలీస్ కమిషనర్ తెలిపారు.
అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చాలా సరళంగా కొనసాగుతున్న ఈవెంట్స్ మరో 5 రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు.


పలు నిబంధనల కారణంగా..
రాష్ట్రంలో జరుగుతున్న ఈవెంట్స్ లో చాలా తక్కువ మంది అర్హత సాధిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతున్న నేపథ్యంలో
తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ తాజాగా విడుదల చేసిన ప్రకటనలో సూచించిన విధంగా తెలంగాణ వ్యాప్తంగా బుధవారం నాటికి 70 శాతం మంది అభ్యర్థులకు ఈవెంట్స్ నిర్వహణ పూర్తి అయినట్లు ఇందులో 54 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు బోర్డు పెర్కొందని


2018లో ఇది 52 శాతంగా ఉన్నట్లు వెల్లడించారు. గతంలో ఉన్న పరుగు పందెం విషయంలో మార్పులు తెచ్చి,
చాలా కష్టమైన ఈవెంట్స్ ను ఈ సారి తొలగించడం ద్వారా లాంగ్ జంప్ లో 83 శాతం మంది పురుషులు, 80 శాతం మంది స్త్రీలు అర్హత సాధిస్తున్నట్లు, ఇంకా షార్ట్ పుట్ లో 93 శాతం మంది పురుషులు, 96 శాతం మంది మహిళలు అర్హత సాధించారని బోర్డు ప్రకటించిందని తెలిపారు.

లాంగ్ జంప్, షార్ట్ పుట్ కు ప్రతీ అభ్యర్థికి 3 అవకాశాలను ఇస్తున్నట్లు, ఛాతీ కొలతను కూడా తొలగించిన విషయాన్ని బోర్డు పేర్కొందని, తప్పుడు వివరాలను నమోదు చేయడానికి అవకాశం లేకుండా డిజిటల్ టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులకు అపోహలు వద్దని ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రూపొందించిన నిబంధనల ప్రకారమే అభ్యర్థులు క్వాలిఫై అయ్యారా? లేదా? అన్నది బోర్డు నిర్ధారిస్తుందని తెలిపారు.


ఈవెంట్స్ ప్రక్రియ పూర్తయిన తర్వాత సాధ్యమైనంత త్వరలో ఫైనల్ ఎగ్జామ్ ను నిర్వహించడానికి కసరత్తు చేస్తున్నట్లు బోర్డు వెల్లడించిన నేపథ్యంలో అర్హత సాధించిన అభ్యర్థులంతా తుది పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలని సూచించారు.

Related Posts

You cannot copy content of this page