జిల్లా పోలీస్ శాఖ పనితీరు, యస్ పి నిరంతర కృషి కి రాష్ట్ర డిజిపి ప్రశంస

Spread the love

డిజిపి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్న యస్.పి రాజేంద్రప్రసాద్
సూర్యాపేట సాక్షిత ప్రతినిధి

డిజిపి కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోలీస్ అధికారుల సమీక్ష సమావేశం లో జిల్లా యస్.పి రాజేంద్రప్రసాద్ ఐపీఎస్ కి ప్రశంసా పత్రాన్ని రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్ ఐపిఎస్
అందజేసారు. గత కొంత కాలంగా జిల్లా పోలీస్ శాఖ మెరుగైన పనితీరును కనపరుస్తూ పోలీసు పని విభాగాలు కమ్యూనిటీ కార్యక్రమాలు, 5ఎస్ అమలు, పెట్రో కార్, బ్లూ కోట్, డయల్ 100 కాల్స్ నిర్వహణ, పోలీస్ స్టేషన్ నిర్వహణ, సమన్లు, వారెంట్, కోర్టు మానిటరింగ్, రోడ్డు భద్రత, పోలీస్ హెచ్ ఆర్ఎంఎస్, పోలీస్ మోటార్ ట్రాన్స్పోర్ట్ నిర్వహణ, నందు ప్రతిభ చూపుతూ ప్రథమ స్థానంలో నిలుస్తూ వస్తుంది, అలాగే దర్యాప్తులో ఉన్న కేసులను వేగంగా కోర్టుకు దాఖలు చేయడలో రాష్ట్రంలో జిల్లా పోలీసు ప్రతిభ, కేసుల్లో నేరస్తులకు శిక్షల అమలు, లోక్ అదాలత్ నందు కేసుల పరిష్కారం లో ప్రతిభ, అనుమానితుల వేలిముద్ర తనిఖీలో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచినది. ఈ సందర్భంగా జిల్లా పోలీసులు సిబ్బంది పని తీరును, జిల్లా యస్.పి రాజేంద్రప్రసాద్ ఐపిఎస్ ని అభినందిస్తూ రాష్ట్రస్థాయి పోలీస్ అధికారుల సమీక్ష సమావేశం లో రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్
ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు సీనియర్ అధికారులు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా యస్.పి మాట్లాడుతూ అధికారుల సూచనల మేరకు సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ జిల్లా పోలీస్ శాఖ ప్రజలకు ఉత్తమ సేవలను అందిస్తుంది. పోలీసు పని విభాగాలను సిబ్బంది అందరూ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని పలు విభాగాలలో సూర్యాపేట జిల్లా ప్రథమ స్థానంలో నిలవడానికి సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నారని, సిబ్బంది పారదర్శకంగా, సమర్ధతతో విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు.

Related Posts

You cannot copy content of this page