ఎమ్మెల్యేల గ్రాఫ్ పై సర్వే రిపోర్టులు రెడీ – 27న కీలక నిర్ణయం

Spread the love

కొద్ది నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టేందుకు కొత్త వ్యూహాలు సిద్దం చేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్ల విషయంలో ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టత ఇచ్చారు.
ఇదే సమయంలో ఈ నెల 27న పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అభ్యర్ధుల ఖరారు కు సంబంధించి కీలక ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. దీంతో పాటుగా ఎన్నికలకు సంబంధించిన కమిటీలు..మేనిఫెస్టో పైన క్లారిటీ ఇస్తారని చెబుతున్నారు. ఎమ్మెల్యేలపై సర్వే రిపోర్టులు సిద్ద కావటంతో..ఎటువంటి నిర్ణయాలు ఉంటాయనే ఉత్కంఠ మొదలైంది.

వచ్చే ఎన్నికల్లో గెలుపు బీఆర్ఎస్ కు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. గెలిచి హ్యాట్రిక్ విజయం నమోదు చేయాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం. దీని కోసం కొత్త నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 27న జరిగే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కీలకం కానుంది. ఇప్పటికే సేకరించిన సర్వే నివేదికల ఆధారంగా ఎక్కడ ఎలాంటి నిర్ణయాలతో ముందుకెళ్లాలనే దాని పైన స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. పని తీరు మెరుగుడపని ఎమ్మెల్యేల విషయంలో ఫైనల్ వార్నింగ్ తప్పదని తెలుస్తోంది. నియోజకవర్గాల్లో జరిగిన సర్వే అంశాలను ప్రస్తావిస్తూ పార్టీ బలోపేతానికి మార్గదర్శకాలు, ప్రజలతో మమేకమయ్యేందుకు వ్యూహాలతో అధినేత కేసీఆర్ సందేశం ఇవ్వనున్నారు.

ఈ సారి త్రిముఖ పోటీ ఉండటంతో ఎన్నికల వ్యూహాలతో పాటుగా ప్రజలకు ఇచ్చే హామీల పైనా సీనియర్లతో కమిటీ వేయనున్నారు. ఎన్నికల ప్రణాళిక రూపకల్పన కోసం కమిటీ ఏర్పాటు చేసి.. దసరా నాడు అధికారికంగా మేనిఫెస్టో విడుదల చేసేందుకు బీఆర్ఎస్ వ్యూహాలు సిద్దం చేస్తోంది. ఈ సారి 100 సీట్లలో గెలుపు లక్ష్యంగా గులాబీ నేతలు కసరత్తు చేస్తున్నారు. సర్వేల్లో వెనుక వరుసలో ఉన్న ఎమ్మెల్యేలకు చివరి మూడు నెలలుగా సెప్టెంబర్ వరకు అవకాశం ఇవ్వనున్నారు. ఆ తరువాత మరోసారి సర్వే చేయించి.. మార్పు రాని వారి స్థానంలో అక్టోబర్ లో కొత్త వారికి బాధ్యతలు అప్పగించే విధంగా ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సారి అన్ని వర్గాల ఓటర్లను తమ వైపు తిప్పుకొనే విధంగా మేనిఫెస్టో రూపకల్పన చేసేందుకు సిద్దం అవుతోంది.

Related Posts

You cannot copy content of this page