చాంద్రాయన్-3, వ్యోమనౌక సాప్ట్ ల్యాండింగ్ విజయవంతం కావాలని జమ్మికుంట ఉర్దూ మీడియం స్కూల్స్ విద్యార్థుల ప్రత్యేక దువా కార్యక్రమం

Spread the love

చాంద్రాయన్-3, వ్యోమనౌక సాప్ట్ ల్యాండింగ్ విజయవంతం కావాలని జమ్మికుంట ఉర్దూ మీడియం స్కూల్స్ విద్యార్థుల ప్రత్యేక దువా కార్యక్రమం
పాల్గొన్న పాఠశాల సిబ్బంది, మైనారిటీ నాయకులు

మన దేశం ఇస్రో శాస్త్రవేత్తలు LMV-3M4, రాకెట్ ద్వారా చంద్రమండలం లోని దక్షిణ ధ్రువం పైకి జులై14న చాంద్రాయన్-3 వ్యోమనౌక ద్వారా ప్రజ్ఞాన్ రోవర్ తో కూడిన విక్రమ్ ల్యాండర్ను ప్రయోగించటం జరిగినది.
నాటి నుండి 40రోజులు ప్రయాణించి 18రోజులు చంద్రుడి కక్ష్యలో తిరుగుతూ నేడు చంద్రుడి పై ప్రజ్ఞాన్ రోవర్ తో కూడిన విక్రమ్ ల్యాండర్ సాప్ట్ ల్యాండింగ్ విజయవంతం కావాలని జమ్మికుంట ఉర్దూ మీడియం స్కూల్స్ విద్యార్థులు అల్లాహ్ కు ప్రత్యేక దువా కార్యక్రమం నిర్వహించారు.


ఈ సందర్భంగా హాజరైన పాఠశాల సిబ్బంది మరియు మైనారిటీ నాయకులు మాట్లాడుతూ చంద్రమండలం లోని దక్షిణ ధ్రువంపై ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా మన దేశం మినహా ఏ దేశం కూడా తమ ప్రయోగాలను చేపట్టలేదని మరియు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 12 దేశాలు 141 సార్లు ప్రయోగాలు జరిపి పూర్తిస్థాయిలో విజయవంతం సాధించలేకపోయాయని పేర్కొనటం జరిగింది.


ఈ సందర్భంలో నేడు భారతదేశం 615కోట్ల భారీ వ్యయం తో సొంత టెక్నాలజీ ద్వారా రాకెట్ ప్రయోగం విజయవంతం చేసి తుది ఘట్టానికి చేరుకున్నందున అంతిమ దశలో ఉన్న ఈ ప్రయోగం విజయవంతం అయ్యి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర దేశాలకు మన దేశం దిక్సూచిగా నిలుస్తుందని ఆశాభావాన్ని వ్యక్తపరచటం జరిగింది.
ఈ సందర్భంగా ప్రయోగంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి ఆ అల్లాహ్ ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తున్నట్లు మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది టి.మనోజ, సుజాత, నాజీయ, ఆయేషా మరియు మైనారిటీ నాయకులు యండి.ఫసియుద్దీన్, షేక్ సాబిర్ అలి, యండి.గౌసొద్దీన్, సజ్జద్ అలి, ఇమ్రాన్ తదితరులు పాల్గొనడం జరిగింది.

Related Posts

You cannot copy content of this page