మీకు నిరంతరం అందుబాటులో ఉండి సేవచేసే నాయకుడిగా నీలం మధు ముదిరాజ్‌

Spread the love

మీకు నిరంతరం అందుబాటులో ఉండి సేవచేసే నాయకుడిగా నీలం మధు ముదిరాజ్‌ కు ఒక్కసారి అవకాశం ఇచ్చాచూడాలని ఆయన సతీమణి కవిత ఓటర్లను అభ్యర్థించారు.


సాక్షిత : పటాన్‌చెరు పట్టణంలో ఎంజీ రోడ్, ముదిరాజ్ బస్తి, కుమార్ బస్తి, గోనెమ్మ బస్తి, సాయిరాం కాలనీ, చైతన్య నగర్, గొల్ల బస్తి, ఓల్డ్ మార్కెట్, శాంతి నగర్, శ్రీరామ్ నాగర్ కాలనీలలో బీఎస్పీ అభ్యర్థి, తన భర్త నీలం మధుముదిరాజ్‌ తరుపున ఆమె విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రజా సమస్యలను కిందస్థాయి నుంచి చూసిన వ్యక్తి అని ఆయన ప్రజల కష్టసుఖాలను తెలుసుకుని సమస్యలకు పరిష్కారం చూపుతారని తెలిపారు. అన్నివర్గాల ప్రజలకు సమప్రాధన్యత ఇచ్చి మీ భాగస్వామ్యంతో ముందుకు సాగే వ్యక్తి అని అన్నారు. అందుకే ఏనుగు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె తెలిపారు. మీ ఇంటి గుమ్మంలో తెల్లవారేసరికి ఉంటాడని మీకు అందుబాటులో ఉండి నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్న విధంగా మీ ప్రజాప్రతినిధిగా ఎన్నుకోవాలని ఆమె తెలిపారు. నియోజకవర్గంలో కొరతగా ఉన్న కళాశాలలు, రహదారులు, భవనాలు, పేదలకు ఇళ్లు ఇతరత్రా గెలిస్తే మీ ముందుంచుతారని తెలిపారు. ఈకార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు,ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 11 21 At 6.10.18 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page