పూర్తి కావస్తున్న వొకేషనల్ కాలేజీ భవన నిర్మాణ పనులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే

Spread the love

MLA supervised the construction work of Vocational College which is being completed

పూర్తి కావస్తున్న వొకేషనల్ కాలేజీ భవన నిర్మాణ పనులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే…


సాక్షిత : స్వర్గీయ కేఎం పాండు జ్ఞాపకార్థం రూ.1 కోటితో బహదూర్ పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద పూర్తి కావస్తున్న 8 గదుల వొకేషనల్ కాలేజీ భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యవేక్షించారు.

ఈ మేరకు ఫిబ్రవరిలో కళాశాల ప్రారంభోత్సవం చేసేలా చర్చించారు. అదే విధంగా కళాశాలకు సంబంధించిన అన్ని రకాల రెగ్యులర్ పోస్ట్ లు త్వరలోనే మంజూరు చేసేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. వొకేషనల్ కళాశాల ప్రారంభోత్సవం నాటికి కాలేజీ గ్రౌండ్ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని, టాయిలెట్స్ కూడా పూర్తి చేసేలా చర్యలు చేపడతామన్నారు.

ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ తిరుపతయ్య మరియు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page