భావి పౌరులైన బాల బాలికలకు మహోన్నతమైన సనాతన ధర్మం, సంస్కృతి సంప్రదాయాలను నేర్పించటం

Spread the love

భావి పౌరులైన బాల బాలికలకు మహోన్నతమైన సనాతన ధర్మం, సంస్కృతి సంప్రదాయాలను నేర్పించటం ద్వారా వారిలో ఆధ్యాత్మిక, నైతిక, మానవతా విలువలను పెంపొందించాలనే పవిత్ర ఆశయంతో మార్చి 30 నుండి ఏప్రిల్ 10 వ,తేదీ వరకు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని భగవద్గీతా మందిరంలో ఆధ్యాత్మిక, వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులు దేవాలయాలు,ధార్మిక సంస్థల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు శిక్షణా తరగతుల కన్వీనర్లు నాగవెల్లి ప్రభాకర్, పర్వతం శ్రీధర్ కుమార్ లు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.
కావున విద్యార్థుల తల్లిదండ్రులు తమ 8 నుండి 15 సం.లోపు చిన్నారులను ప్రతిరోజూ ఉదయం 8.30 నుండి 11.30 వరకు ఉచితంగా నిర్వహించే ఈ తరగతులకు పంపించవలసిందిగా వారు ఆ ప్రకటనలో కోరారు.

Related Posts

You cannot copy content of this page