ఉచిత బస్ పాస్ లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

Spread the love

ఉచిత బస్ పాస్ లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సుమారు 16 ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు గత తొమ్మిదేళ్లుగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సొంత ఖర్చులతో ఉచిత బస్ పాస్ లను అందిస్తున్న నేపథ్యంలో.. షాపూర్ నగర్ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ఉచిత బస్ పాస్ లను ఎమ్మెల్యే అందజేశారు. దూర ప్రాంతాల నుండి బడికి వచ్చే పేద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతంగా ఉండేలా ఎమ్మెల్యే ఉచిత బస్ పాస్ లను పంపిణీ చేస్తున్నారు.

ఈ బస్ పాస్ లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అదే విధంగా పదవ తరగతి పూర్తైన విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాల, వొకేషనల్ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన నలుగురు విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా నగదు బహుమతిని అందించారు. ఈ కార్యక్రమంలో జీడిమెట్ల డిపో మేనేజర్ విజయ్ కుమార్, హెడ్మాస్టర్ దుర్గయ్య, స్థానిక డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్ మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page