ప్రగతి భవన్ లో మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్

Spread the love

Ministers Harish Rao, Niranjan Reddy press meet at Pragati Bhavan

ప్రగతి భవన్ లో మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్

మంత్రి హరీశ్ రావు కామెంట్స్

ఎమ్మెల్యేల వ్యవహరంలో దొరికిపోయిన బీజేపీ దొంగల పరిస్థితి కుడితిలో పడ్డఎలుకలా తయారయింది.
గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్న పరిస్థితి బీజేపీది.
ముందేమన్నరు. ఎమ్మెల్యలను కొనుగోలు చేయడానికి వచ్చిన మఠాధిపతులు, స్వామీజీలు మాకు తెలియనే తెలియదన్నరు.


ప్రభుత్వం వారిని అరెస్టు చేసి జైలుకు పంపిన తర్వాత బీజేపీ నాయకుల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది.
బీజీపీ పార్టీ అధ్యక్షుడేమో తడి బట్టలతో ప్రమాణాలు చేస్తనంటడు. ప్రధాన కార్యదర్శిఏమో కోర్టుల్లో కేసులు వేస్తడు. విచారణ ఆపండి, ఈ కేసు ఢిల్లీకి ఇవ్వండి, అని కోర్టుల్లో కేసులు వేస్తడు. తడి బట్టలు, పొడి బట్టలతో ప్రమాణాలు చేస్తరు.. అసలు ఏంటి ఇది.


మాకు సంబంధం లేదంటరు.. కోర్టుల్లో కేసులు వేసి విచారణ ఆపుతరు . ప్రజా కోర్టు లేదా… ఎమ్మెల్యే కొనుగోలు కేసులో సంబంధం లేకపోతే కోర్టులో కేసులు ఎందుకు వేస్తరు.. సమాధానం చెప్పాలి కదా..
కేసు తొందరగా విచారణ జరగాలి. న్యాయం జరగాలి. నిష్పాక్షంగా దర్యాప్తు జరగాలని ఏ రాజకీయ నాయకుడైనా, పార్టీ అయినా అడుగుతరు… కాని దర్యాప్తు ఆపాలి అంటే.. అర్థం ఏంటి.


అసలు బండారం బయట పడుతుందని బీజేపీ నేతలు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నరు.
సర్వోన్నత న్యాయస్థానం కూడా ఇవాళ బీజేపీ బ్రోకర్ల సంభాషణ విన్నారు. పేపర్లో వచ్చింది. వారు ఈ వీడియోల ప్రస్తావన కోసం మాట్లడుతున్నరు

.
గవర్నర్ ఎందుకు నిన్న మాట్లాడారో తెలియలేదు. మేం మాట్లాడింది. రాహుల్ గాంధీ మీద పోటీ చేసిన కేరళకు చెందిన తుషార్ కోసం మాట్లాడాం. గవర్నర్ గారు ఎందుకో తన ఎడీసీ తుషార్ కోసం మాట్లాడారు.
తెలంగాణ పోలీసుల మీద, ఐపీఎస్ అధికారుల మీద బీజేపీకి నమ్మకం లేదు.
తెలంగాణ పోలీసుల మీద విశ్వాసం లేకపోతే..తెలంగాణ ప్రజల ఓట్లు ఎలా అడుగుతున్నరు.
బీజేపీది తెలంగాణ వ్యతిరేక ధోరణి. కక్షపూరిత ధోరణి. బీజేపీ 16-17 రాష్ట్రాల్లో ఉంది కదా.. ఆ రాష్ట్రాల్లో కేసులు నమోదు కావడం లేదా.

అక్కడ కేసులన్నీ సీబీఐకి ఇవ్వమని అడుగుతారా
తెలంగాణ ప్రజల మీద, పోలీసుల మీద బీజేపీ కక్షపూరిత వైఖరి అవలంభిస్తుంది.
లోయర్ కోర్టు, హైకోర్టు, సుప్రింకోర్టుకు వెల్లడానికి అవసరం ఏమొచ్చింది. ఎంక్వైరీ ఆపమని, సిట్ ను ఆపమని ఎందుకు బీజేపీ నేతలు అడుగుతున్నరు.


ఇందులో విషయం లేకపోతే ఇన్ని సార్లు ఎందుకు కోర్టుకు పోతున్నరు.
8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడగొట్టిన బీజేపీ, తెలంగాణకు వచ్చే సరికి కుడితిలో పడ్డ ఎలుకలా పరిస్థితి తారుమారయింది.
ఆ దొంగలను పట్టుకుని జైల్లో పెట్టింది ప్రభుత్వం. దీంతో ఆగమాగం అవుతున్నరు బీజేపీ వాళ్లు.
నిజంగా సంబంధం లేకపోతే కోర్టు తలుపులు ఎందుకు కొడుతున్నరు.


టీవీల్లో ఎమ్మెల్యే కొనుగోలుపై బీజేపీ వాళ్లు కేసుతో మాకు సంబంధం లేదని, మఠాధిపతులను కేసీఆర్ పంపారని చెబుతున్నరు. సంబంధం లేకపోతే కేసు ఆపమని ఎందుకు అడుగుతున్నరు. ఎందుకు భయపడుతున్నరు.
సీబీఏకి ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఇవ్వాలని బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమెందర్ రెడ్డి కోర్టుకు వెళ్లారు.
సీఎం పారదర్శకంగా కేసు విచారణ జరగాలని సిట్ ను ఏర్పాటు చేశారు.


కుట్రలు బయటపడతయని, ఇజ్జత్ మానం పోతుందని , పరువు కాపాడుకోవాలని బీజేపీ నేతలు విచారణ ఆపాలని ప్రయత్నిస్తున్నరు.


ఇంకో సారి ప్రభుత్వాన్ని పడగొట్టమని చెంపలు వేసుకోవడం తప్ప బీజేపీకి మరో మర్గం లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తడి బట్టలతో ప్రమాణం చేస్తడు. ప్రధాన కార్యదర్శి ఏమో కేసు పెట్టోద్దంటూ కోర్టుకు వెళ్తడు. ఇదేం పద్ధతి
తెలంగాణ పోలీసులు ఏం చేశారు. దొంగను పట్టుకోవడం తప్పా.. నిస్సిగ్గుగా మేం ఎమ్మెల్యేలను కొంటమని వస్తే పోలీసులు పట్టుకుంటే విచారణ ఆపాలని, దొంగలను పట్టుకోవద్దని బీజేపీ నేతలు మాట్లాడతారా

.

బీజేపీ ప్రధాన కార్యదర్శి కోర్టులో కేసులు వేస్తరు. సిట్ దర్యాప్తు ఆపమంటరు. చిన్న పిల్లలకు కూడా విషయం ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది.
వీరు దొరికిపోయి నోటికి వచ్చినట్లు మాట్లాడతున్నరు. గల్లీ లీడర్లు ఓ మాట, ఢిల్లీ లీడర్లు ఓమాట మాట్లడుతున్నరు.
తెలంగాణ ప్రజలు బీజేపీ బహురూప వేశాలు. నాటకాలు ప్రజలు గమనించాలి. పూటకో మాట మాట్లాడుతున్నరు , నగ్నంగా దొరికిపోయి మాట్లాడుతున్నరు. సంబంధం లేకపోతే మీరు కోర్టులకు ఎందుకు వెళుతున్నరు.
ప్రెస్ మీట్లు ఎందుకు పెడుతున్నరు. ప్రజలకు అన్ని విషయాలు స్పష్టంగా మాట్లాడుతున్నరు.


మీకు నిజాయితీ ఉంటే దర్యాప్తు జరగనియండి. అన్ని విషయాలు బయటకు రానీయండి.
దర్యాప్తు జరిగితే పెద్ద వాళ్ల పేర్లు బయటకు వస్తాయి. దేశమంతా తెలుస్తుందని భయపడుతున్నరు. మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది.
నిర్లజ్జగా, నిస్సిగ్గుగా బీజేపీ చేసిన వ్యవహరాన్ని తెలంగాణ ప్రజలు, యువకులు, విద్యావంతులు ,మేధావులు గమనించాలి.
ఎవరు ఎవరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నరో దేశ ప్రజలందరికి తెలుసు.
రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న వ్యక్తులు గౌరవ ప్రదంగా ఉండాలి. తమ విలువ తగ్గించుకుని, స్థాయి తగ్గేలా మాట్లాడటం తగదు.
మా మంత్రి సబిత ఇంద్రారెడ్డి , గవర్నర్ ని కలిసి అనుమానాలు నివృత్తి చేశారు.
మంత్రి నిరంజన్ రెడ్డి కామెంట్స్

ఎమ్మెల్యేల కొనుగోలుపై ఖచ్చితంగా విచారణ జరుగుతుంది. నిజానిజాలు తొందరలోనే బయటపడుతాయి

ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా విచారణ అగదు

ప్రజాస్వామ్యాన్ని కించపరిచేలా బీజేపీ దేశాన్ని పాలిస్తున్నది

ఉత్తమమైన పరిపాలన చేసినప్పుడు ఉత్తమమైన ఫలాలు అందుతాయి.

మన రాష్ట్రంలో ఇప్పుడు ప్రజాస్వామ్య పాలన నడుస్తున్నది

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను పక్కకు పెట్టి బీజేపీ పదుల సంఖ్యలో అక్కడి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చి బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నది

మన రాష్ట్రంలో బీజేపీ చేస్తున్న చర్యలను చూస్తున్నాము.వందల కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మేల్యే లను కొనుగోలు చేయాలని చసింది

ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో మాకు సంబంధం లేదని చెప్పి తడి బట్టలతో దేవుడి దగ్గరికి వెళ్ళారు

బీజేపీ వాళ్ళ కు సంబంధం లేకపోతే కోర్టు వెళ్లి సిట్ విచారణ ఆపాలని ఎందుకు కోరారు ?

బీజేపీ కి సంబంధం లేకపోతే మీ పార్టీ ప్రధాన కార్యదర్శి కోర్టు కి ఎందుకు వెళ్లాడు ?

ఎమ్మెల్యే ల కొనుగోలు విషయంలో వాస్తవాలు బయటికి రావాలని సిట్ వేశాము

Related Posts

You cannot copy content of this page