హైదర్ నగర్ డివిజన్ పరిధి నిజాంపేట్ రోడ్డు లోని అల్లాపూర్ సొసైటీ విజేత గ్రీన్ హోమ్స్

Spread the love

హైదర్ నగర్ డివిజన్ పరిధి నిజాంపేట్ రోడ్డు లోని అల్లాపూర్ సొసైటీ విజేత గ్రీన్ హోమ్స్ లో చేపడుతున్నటువంటి యూజీడి పైప్ లైన్ నిర్మాణ పనులను కాలనీ వాసులతో కలిసి పరిశీలించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .

ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ హైదర్ నగర్ డివిజన్ లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, యూజీడీ వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని, పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్ కు సూచించారు. అదేవిధంగా డివిజన్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని, అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు సంగమేశ్వర రావు, లోకేష్, అప్పి రెడ్డి, ఆనంద్, రమణ, అప్పారావు, జగదీశ్, మనోజ్ కుమార్, శ్రీనివాస రావు, రాజు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page