బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలే కాసానిని గెలిపిస్తాయి: చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య

Spread the love

బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలే కాసాని జ్ఞానేశ్వర్ ని గెలిపిస్తాయని ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. శుక్రవారం చేవెళ్ల మండల పరిధి తంగడపల్లి, మడికట్టు గ్రామాలు, హౌసింగ్ బోర్డ్ కాలనీలలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే చేవెళ్ల పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపుకు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రైతులకు రైతుబంధు రైతుబీమా, 24 గంటలు ఉచిత కరెంటు, రైతు వేదికలు, గ్రామాలలో సిసి రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు మురుగు కాలువల నిర్మాణం నూతనంగా గ్రామపంచాయతీలో ఏర్పాటుతోపాటు వాటికి సొంత భవనాల నిర్మాణం, నర్సరీలు, వైకుంఠధామాలు ఇలా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు ఒంటరి మహిళలకు చేనేత కార్మికులకు పింఛన్లు పంపిణీ చేసిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందని పేర్కొన్నారు.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ హయాంలో కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని, ఎన్నికలలో ఆరు గ్యారంటీలు అంటూ ప్రకటించినప్పటికీ డిసెంబర్ 9 నాటికి హామీలన్నీ నెరవేరుస్తామని కాంగ్రెస్ పార్టీ పెద్దలు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఒకటి రెండు పథకాలు అమలు చేయడంతో పాటు మిగతా వాటికి మొండి చేయి చూపినట్లే ఉందని పేర్కొన్నారు. పింఛన్ డబ్బులు 2000 నుంచి 4,000 కు పెంచుతామని ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయారని, 18 సంవత్సరాల పైబడిన ఆడపిల్లలకు స్కూటీలు పంపిణీ చేస్తామని, కళ్యాణ లక్ష్మి పథకంలో లక్ష రూపాయలతో పాటు తులం బంగారం అని చెప్పారని ఒకరికి కూడా ఇంతవరకు అమలుకు నోచుకోకపోవడం అత్యంత శోచనీయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు పూర్తిగా అమలు చేయకపోగా కేంద్ర ప్రభుత్వం మరికొన్ని హామీలు ఇస్తూ రాహుల్ గాంధీ మరో మేనిఫెస్టో విడుదల చేశారని అది ఎప్పుడు సాధ్యమవుతుందో ఎవరికి అర్ధం కాకుండా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్, డిసిసిబి చైర్మన్ పటోళ్ల కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ బాలరాజ్, ఏఎంసి వైస్ చైర్మన్ నర్సింలు, మండల పార్టీ వైస్ ప్రెసిడెంట్ ముకుందం గౌడ్, తంగడపల్లి గ్రామ సర్పంచ్ అనూష సత్తయ్య గౌడ్ మరియు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page