ఆర్ధిక సంస్కరణల జాతిపిత మాజీ ప్రధానమంత్రి PV. నరసింహారావు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు

Spread the love

సాక్షిత ; దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో పలు సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని ఆర్ధిక ఇబ్బందుల నుండి గట్టెక్కిచ్చిన గొప్ప నాయకుడు, ఆర్ధిక సంస్కరణల జాతిపిత మాజీ ప్రధానమంత్రి PV. నరసింహారావు అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మాజీ ప్రధానమంత్రి PV 102 వ జయంతి సందర్భంగా PV మార్గ్ లో గల PV ఘాట్ లో మంత్రి తలసాని నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి PV నరసింహ రావు అని పేర్కొన్నారు. బహుబాషా కోవిదుడు, గొప్ప రాజనీతిజ్ఞుడు గా పేరుగాంచారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లోని తెలంగాణ ప్రభుత్వం PV సేవలను ఎల్లప్పుడూ స్మరించుకుంటూ తగినరీతిలో గౌరవిస్తుందని చెప్పారు. PV శతజయంతిని ఎంతో ఘనంగా నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. అంతేకాకుండా నెక్లెస్ రోడ్డుకు PV మార్గ్ గా నామకరణం చేయడమే కాకుండా భారీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తినట్లు వివరించారు. ప్రపంచ దేశాలలో భారతదేశ ఖ్యాతిని చాటిచెప్పిన PV నరసింహారావు కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి తలసాని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో MLC, PV కుమార్తె సురభి వాణిదేవి, సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ, RDO వసంత తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page