స్మార్ట్ కిడ్జ్ లో ఘనంగా కరుణామయుని జనన వేడుకలు

Spread the love


Karunamayu’s birthday celebrations are grand in Smart Kidz

స్మార్ట్ కిడ్జ్ లో ఘనంగా కరుణామయుని జనన వేడుకలు

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

క్రిస్మస్ వేడుకను ఖమ్మం నగరంలోని “స్మార్ట్ కిడ్జ్” పాఠశాల యందు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో పూరిపాక సెట్టింగు నిర్వహించి “ఏసుక్రీస్తు” జన్మ వృత్తాంతం వివరించే విధంగా విద్యార్థులు ప్రదర్శించారు. మేరీ మాత శాంతా క్లాజా దేవదూతలు తదితర వేషాధరలతో విద్యార్థులు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.


క్రిస్మస్ ట్రీ ఏర్పాటు చేసి క్రిస్మస్ తాతయ్య శాంతా క్లాజా చిన్నారులకు బహుమతుల ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య క్రిస్మస్ కేక్ పాఠశాల చిన్నారులతో కట్ చేయించారు. ఈ సందర్భంగా చిన్నారులు ఒకరికొకరు కేక్ తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ, ఏసుక్రీస్తు బోధనలు మంచి వైపు అడుగులు వేసే విధంగా శాంతి బోధించే ఆయన సూక్తులు ఎంతో ఆదర్శనీయమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మరి వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, పాఠశాల ప్రిన్సిపాల్ విజయ కుమారి మరియు ఉపాధ్యాయులు,
సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page