హైకోర్టు అనుమతి తో మళ్ళీ హింది పరీక్ష

Spread the love

తెలంగాణలో టెన్త్ పేపర్ లీక్ సందర్భంగా… డిబారైన పదో తరగతి విద్యార్థి హరీష్.. ఇవాళ మళ్లీ హిందీ పరీక్ష రాస్తున్నాడు. ఈ కేసు వల్ల డిబారైన హరీష్.. హిందీ పేపర్ తిరిగి రాసేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టును కోరడంతో… హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఇవాళ లోని పరీక్షా కేంద్రానికి వెళ్లిన హరీష్.. హైకోర్టు అనుమతి పత్రాన్ని అధికారులకు చూపించాడు. దాంతో వారు పరీక్ష రాసేందుకు అనుమతి ఇచ్చారు.

నిజానికి హరీష్‌ని డిబార్ చెయ్యడం రాజకీయంగా కలకలం రేపింది. హిందీ పరీక్షా సమయంలో అతని దగ్గర ఉన్న హిందీ ప్రశ్నాపత్రాన్ని ఎత్తుకుపోయిన యువకుడు దాన్ని లీక్ చేశాడు. దాంతో.. అధికారులు హరీష్‌ని డిబార్ చేశారు. దీనిపై ప్రతిపక్ష బీజేపీ నేతలు మండిపడ్డారు. ఆ పిల్లాణ్ని తిరిగి పరీక్ష రాయించాల్సిందే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో హైకోర్టు తీర్పుతో.. హరీష్ మళ్లీ పరీక్ష రాసే ఛాన్స్ వచ్చింది.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page